ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంట్రీ పాసులు ఫ్రీ

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు శ్రేయాస్ మీడియా అదిరిపోయే శుభవార్త చెప్పింది. రేపు హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీ లో జరిగే రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంట్రీ పాసులు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది శ్రేయాస్ మీడియా. అన్ని కేటగిరీల పాసులు పూర్తిగా ఉచితం అని… కొనుగోలు చేయాల్సిన అవసరం అసలు లేదని శ్రేయాస్ మీడియా క్లారిటీ ఇచ్చింది. రేపు సాయంత్రం 6 గంటల సమయంలో రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది.

కాగా.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యాం. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా… టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా… యువి క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కుతోంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది. ఇక ఈ సినిమా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది.