కొన్నేళ్లుగా స్నేహ పూర్వకంగా ఉంటున్న టీర్ ఎస్, వైసీపీ ప్రభుత్వాల మధ్య ఇప్పుడు మళ్లీ నీళ్ల జగడం రాజుకుంది. కృష్ణా జలాల వివాదం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై కోర్టులో న్యాయపోరాటానికి వెళ్తామని కేసీఆర్ ప్రభుత్వం డిసైడ్ కావడంతో ఈ వివాదం రాజుకుంది. ఇక మంత్రులు చేస్తున్న కామెంట్లు ఇరు ప్రభుత్వంల మధ్య కాక పుట్టిస్తున్నాయి.
మొన్నటికి మొన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్‌పై సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. వారిద్దరినీ దొంగ, గజదొంగ అని చెప్పడంతో వివాదం మరింత ముదిరినట్టయింది. దీంతో అటు ఏపీ నుంచి కూడా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ వేస్తున్నారు.
అయితే తాజాగా జగన్ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. కృష్ణా జల జగడంపై తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, అందుకే సీఎం జగన్ ఎప్పుడూ ముందుంటారని చెప్పడం వెనక జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. అంటే జగన్ చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకోవడానికి రెడీగా ఉన్నారని చెబుతున్నారన్న మాట. అంటే జగన్ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. వివాదం ముదిరితే ఆయనకు మంచిది కాదని భావిస్తున్నారు.