నడుచుకుంటు ధ్యానం చేయడం తెలుసా..?

ధ్యానం.. మనలో మెదిలో ఆందోళనలు, భయాలు పోగొట్టి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అందుకే భారతీయులు ధ్యానానికి ఎంతో ప్రాధానమిస్తున్నారు. రుషులు, మునులు సైతం అదే అనుసరిస్తారు. ఆహ్లాదకర వాతావరణంలో పద్మాసనం వేసుకొని కళ్లు మూసుకొని ఏకాగ్రతతో శ్వాస మీద ధ్యాస కేంద్రీకరించడమే ధ్యానంగా భావిస్తారు. అయితే, నడుస్తూ కూడా ధ్యానం చేసే ప్రక్రియ(మెడిటేషన్‌ వాక్‌) ఉందనే విషయం చాలా మందికి తెలియదు. వాకింగ్‌ మెడిటేషన్‌ను బౌద్ధంలో ‘‘కిన్హిన్‌ ’’అంటారు. దీన్ని ‘సూత్ర వాక్‌’ అని మరోక పేరుతో కూడా పిలుస్తారు. ఒక చోట కూర్చుని ధ్యానం చేసేకన్నా మధ్య మధ్యలో ఇలా వాకింగ్‌ మెడిటేషన్‌నూ చేస్తారు. కిన్హిన్‌ అనేది జాజెన్‌కు(కూర్చొని ధ్యానం చేయడం) వ్యతిరేక ప్రక్రియ.

చేసే విధానం..

మెడిటేషన్‌ వాక్‌లో ఒక చేతిపిడికిలి బిగించి మరో చేతితో ఆ పిడికిలిని మూస్తారు. అనంతరం క్లాక్‌వైజ్‌ డైరక్షన్‌లో మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ గుడ్రంగా తిరుగుతారు. అడుగుకు ముందు ఒక బ్రీత్‌(ఒక ఉచ్ఛాశ్వ, నిశ్వాస) పూర్తి చేస్తారు. కిన్హిన్‌ అంటే చైనా భాషలో ఒక దాని గుండా ప్రయాణించడమని అర్థ్ధం.

1. రక్తప్రసరణ మెరుగు..

తరచూ వాకింగ్‌ మెడిటేషన్‌ చేసేవారిలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. వాకింగ్‌ మెడిటేషన్‌ చేసే వారి పాదాల్లో రక్తం సక్రమంగా సరఫరా కావడంతో కాళ్ల అలసట, మందస్థితిని పోగొడుతుంది.

2. జీర్ణశక్తిని పెంచుతుంది..

ఆహారం తీసుకున్న తర్వాత కాసేపు ప్రశాంతంగా అటూ ఇటూ నడిస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. ప్రత్యేకించి కడుపు నిండా తిన్నప్పుడు ఇలా నడవడం ద్వారా ఆహారం జీర్ణకోశ ప్రాంతంలో సమంగా పంపిణీ అయి మలబద్ధకం నివారిస్తుంది.

3. ఒత్తిడి దూరం..

ఒత్తిడిని తగ్గించుకోవాలంటే కూర్చొని ధ్యానం చేయడం కంటే నడుస్తూ చేస్తేనే ఎక్కువ ఫలితం ఉంటుంది. అయితే, దాదాపుగా 10 నిమిషాల వరకూ మెడిటేషన్‌ వాక్‌ చేయాలి.

4. డిప్రెషన్‌ తొలగిస్తుంది..

2014లో వెలువడిన ఓ సర్వే ప్రకారం బౌద్ధంలోని ఓ మెడిటేషన్‌ వాక్‌ ప్రక్రియను అనుసరించిన వద్ధుల్లో డిప్రెషన్‌కు సంబంధించిన లక్షణాలు చాలా వరకు తగ్గినట్లు గుర్తించారు. దీంతో పాటు రక్తప్రసరణ, ఫిట్నెస్‌ మెరుగవడం గుర్తించారు. ఇది దాదాపు యువకులు చేసే రోజువారీ వ్యాయామం ఫలితంతో సమానంగా ఉంటుంది.

5. మెరుగైన ఆరోగ్యం..

ప్రకృతివనంలో కాసేపు నడుస్తూ ధ్యానం చేయడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. 2018లో వెలువడిన ఓ సర్వే ప్రకారం కనీసం 15 నిమిషాల పాటు వెదురు వనంలో మెడిటేషన్‌ వాక్‌ చేసిన వారిలో ఆందోళన, ఒత్తిడి, రక్తపోటు తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు.