పెట్రోలియం జెల్లీని ఇలా కూడా ఉపయోగించవచ్చు తెలుసా…?

-

సాధారణంగా మనం పెట్రోలియం జెల్లీని ఉపయోగిస్తుంటాం. అయితే సాధారణంగా ఉపయోగించడం మాత్రమే కాకుండా సరికొత్తగా వీటిని మరిన్ని వాటికి కూడా ఉపయోగించవచ్చు. మరి అవి ఏమిటో తెలుసుకోవడానికి ఒక లుక్ వేసేయండి.

న్యాచురల్ ఐబ్రోస్ :

న్యాచురల్ ఐబ్రోస్ మీరు పొందాలి అంటే కొద్దిగా పెట్రోలియం జెల్లీని తీసుకుని మీ కనుబొమ్మల మీద అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మీకు నేచురల్ ఐబ్రోస్ వస్తాయి.

ఐ మేకప్ ని తొలగించడానికి:

మనం ఐ మేకప్ ఏమైనా వేసుకున్నప్పుడు దానిని సులువుగా తొలగించాలి అంటే మీ కళ్ళ చుట్టూ పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి. దీనితో సులువుగా ఐ మేకప్ ని తొలగించుకోవచ్చు. కానీ అది మీ కళ్ళకి తగలకుండా ఉండేటట్టు జాగ్రత్తగా వుండండి.

పాదాల కోసం :

ఇంట్లో వివిధ రకాల పనులు చేస్తూ ఉంటాం. వీటి వల్ల పాదాలు పగిలి పోతూ ఉంటాయి. ఆ మంట తగ్గాలంటే పెట్రోల్ జెల్లీని ఉపయోగించండి. దీని కోసం మీరు కాళ్ళకి మొత్తం పెట్రోలియం జెల్లీని రాసుకుని సాక్సులు ధరించి ఉంచండి. దీనితో మీకు పగుళ్లు తగ్గిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news