కొన్ని టాబ్‌లెట్స్ వేసుకునే ముందు ఇవి అస్సలు తాగకూడదు తెలుసా.. ముఖ్యంగా డ్రింక్‌ చేసి ఆ టాబ్‌లెట్‌ వేసుకోకూడదట

-

ఆరోగ్యానికి అన్నీ మంచివే అయినా సరే కొన్నింటిని కలిపి తినకూడదంటారు. గుడ్డు ఆరోగ్యానికి మంచిదే..అలాగే పొట్లకాయ కూడా కానీ ఈ రెండిటిని కలిపి తినటం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. క్రమపద్దతి లేకుండా అన్నీ కలిపేసి తిన్నా, తాగినా ఆరోగ్యం దెబ్బతినటం కాయం. ఇలానే మనం తెలిసితెలియక కొన్ని రకాల టాబ్ లెట్లను కూడా కొన్ని ఆహార పదార్థాలు తిన్న తర్వాత లేదా తాగిన తర్వాత వేసుకుంటూ ఉంటాం. అలా వేసుకోకూడని కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈరోజుల్లో మద్యపానం అలవాటు దాదాపు అందరికి ఉంటుంది. అయితే ఈ అలవాటున్న వారు జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు తగ్గడానికి వేసుకునే ఎసిటామినోఫెన్‌ అనే మాత్రను మద్యం సేవించిన సమయంలో అసలు వేసుకోకూడదు. ఒకవేళ వేసుకోవాల్సి వచ్చినా 6 గంటల తర్వాతే వేసుకోవాలి.

రిటాలిన్ ట్యాబ్లెట్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. నరాల బలహీనత ఉన్నవాళ్లు… ఉత్తేజం కోసం ఈ ట్యాబ్లెట్స్‌‌ను ఉపయోగిస్తారు. ఈ ట్యాబ్లెట్స్ వాడేవారు చాక్లెట్‌ను తినకపోవడం చాలా మంచిదట. ఎందుకంటే చాక్లెట్‌లో ఉండే తియోబ్రోమిన్ అనే రసాయనం, రిటాలిన్ ట్యాబ్లెట్‌లోని రసాయనం కలిస్తే మూర్ఛ వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.

ఎలర్జీతో బాధపడేవారు ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కానీ, ఎలర్జీ సిరప్ తాగినప్పుడు కానీ యాపిల్ జ్యూస్‌ను తాగకూడదట. ఇలా తాగితే డ్రగ్ పనిచేయకపోగా, కొన్ని సందర్భాల్లో ఎలర్జీ ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చు.

మెంటోస్, పిప్పర్‌మెంట్ లాంటివి నమిలిన తర్వాత కూల్‌డ్రింక్ సేవించకూడదు. అలా గానీ తాగితే సైనైడ్ అనే విష రసాయనం తయారై మరణించే అవకాశం ఉంది.

దగ్గు టానిక్ తాగే ముందు గానీ, తాగిన తర్వాత గానీ నిమ్మకు సంబంధించిన ఎలాంటి పానీయం, ఆహారం తీసుకోకూడదు. అంటే నిమ్మకాయ పచ్చడి, పులిహోర, నిమ్మరసం లాంటివి. అలా తాగితే ఎంజైమ్స్‌ను నిమ్మలోని గుణం నియంత్రిస్తుంది. దీనివల్ల స్టాటిన్స్ ప్రభావం తగ్గి రక్తపోటు వస్తుందట.

మాంసం తిని యాంటిబయాటిక్స్ మందులు వేసుకోకూడదు.. ఇలా గానీ వేసుకుంటే రక్తపోటు పెరిగి ప్రాణాల మీదకు తెస్తుంది.

నిమ్మ రసం తాగిన వెంటనే పాలు తాగడం అత్యంత ప్రమాదకరం. అలా తాగితే పొట్టలో యాసిడ్స్ తయారై కడుపుమంట, గుండెల్లో మంట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాలు, పాల సంబంధిత పదార్థాలు తిని యాంటిబయాటిక్స్ మందులు వేసుకోకూడదు. అలా వేసుకుంటే పాలలో ఉన్న కాల్షియం, ఐరన్ వంటి మినరల్స్ యాంటిబయాటిక్స్‌ను నియంత్రిస్తాయి. దీనివల్ల మందులు వేసుకున్నా ఉపయోగం ఉండదు.

ఇలా మీరు కూడా ఎప్పుడో ఒకసారి చేసే ఉంటారు. మన ఆత్మీయులు కూడా తెలిసితెలియక ఈ పొరపాటు చేస్తుంటారు. ఈ ఆర్టికల్ షేర్ చేసి వారికి సమాచారం ఇచ్చేయండి మరీ.!

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news