దిల్ సినిమాను నిర్మించి.. ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించిన నిర్మాత రాజు.. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో రాత్రికి రాత్రి పొలిటికల్ సర్కిళ్లల్లో వార్తయి పోయాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుని, చిన్న సినిమాలతో బిగ్ హిట్స్ కొట్టిన రాజు.. ఇప్పుడు పొలిటికల్ స్టెప్పులు వేసే దిశగా దూసుకుపోతున్నారని అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన విందుకు దక్షిణాది నుంచి హాజరైన ఏకక సినీ నిర్మాతగా ఉన్నారు. పైగా తనకు ఎంతో మందితో పరిచయాలు ఉన్నప్పటికీ.. ప్రధాని మోడీ కేవలం రాజుకు మాత్రమే ఇన్వి టేషన్ పంపడం కూడా చర్చకు దారితీసింది.
ప్రస్తుతం దేశంలో మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహి స్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖలకు ఆయన ఇటీవల విండు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి కూడా అనేక రంగాల్లో నిష్టా తులైన ప్రముఖులను, సినీ వర్గాలను కూడాఆహ్వానించారు. అయితే, దక్షిణాది నుంచి మాత్రం ఎవరికీ ఆహ్వానం అందక పోవడం గమనార్హం. అయితే, ఒక్క దిల్ రాజుకు మాత్రం ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని రాజే చెప్పుకొచ్చారు. ‘‘మిమ్మల్ని కలవడం చాలా గౌరవంగా భావిస్తున్నా.“అంటూ రాజు.. ప్రధాని మోడీని ఉద్దేశించి కామెంట్ పెట్టారు.
ఇక, మోడీతో దిల్ రాజు షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటో కూడా సోషల్ మీడియాల్లోకి వచ్చింది. దీంతో రాజుకు.. బీజేపీ ఇంత ప్రత్యేకత ఇవ్వడం, ఇంత మంది మేధావులు, సినీ దిగ్గజాలు ఉండి కూడా రాజుకు మాత్రమే కేంద్రంలోని బీజేపీ నేతలు ఆహ్వానం పంపడం వంటివిషయాలను మేధావులు ఒకింత సీరియస్‌గానే తీసుకున్నారు. దీనివెనుక ఏం జరిగి ఉంటుందనే విషయంపైదృష్టి పెట్టారు. ఇక్కడ రెండు ప్రయోజనాలు.. అవి కూడా పరస్పర ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకటి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎదగాలని భావిస్తున్న బీజేపీ మేధావులను, సినీ, కళా రంగ దిగ్గజాలను దరి చేర్చుకుంటోంది.
వీరివల్ల పార్టీకి ప్రయోజనం ఉంటుందని బీజేపీ భావిస్తోంది. గుజరాత్ ఫార్ములా కూడా ఇదే. ఈ నేపథ్యంలో దిల్ రాజుకు పార్టీ దగ్గరైనట్టు సమాచారం. ఇటీవల కేంద్ర మంత్రి ఒకరు ఈయనతో ప్రత్యేకం గాభేటీ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఇలా రాజు పోస్టింగ్ పెట్టడం గమనార్హం. ఇక, రాజు కోణం నుంచి చూస్తే.. ఈయనకు కూడా రాజకీయంగా ఒక ఆసరా అవసరం. ఇటీవల కాలంలో ఐటీ దాడులు పెరిగిన నేపథ్యంలో రాజు తీవ్రంగా మధన పడ్డారు. సో.. రాజకీయంగా తనకు అండగా ఎవరైనా నిలిస్తే.. ఈ సమస్య ఉండేది కాదనే అభిప్రాయం ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలో నే బీజేపీకి చేరువ అవుతున్నారని అంటున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు ఆయన పార్టీలో చేరతారా? లేదా ? చూడాలి.