దిల్ రాజు నిర్మాణం లో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో హీరో విజయ్ నటిచిన వారీసు సినిమా తమిళనాడు లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా కోసం దిల్ రాజు 250 కోట్లు పెట్టి మరీ భారీ ఎత్తున తీశారు.ఇక వారిసూ ను వారసుడును తెలుగు లో ముందుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా తెర వెనుక మంత్రాంగం నడిచి 14 కు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
సంక్రాంతి పండుగ బరిలో కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా అలాగే బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన బాలయ్య బాబు సినిమా వీర సింహ రెడ్డి సినిమా లు ఉండటం వల్ల వెనక్కి వెళ్ళింది.ఇక తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా తమ తెలుగు స్టార్స్ ఉన్నప్పుడు మిగతా వాళ్ళకు ఛాన్స్ ఇవ్వరు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళాడు.
తమిళంలో వారిసు కు హిట్ టాక్ వచ్చినా కాని తెలుగు లో మాత్రం బోల్తా పడింది. ఇది సెంటిమెంట్ పిండేసే సినిమా అని తమిళంలో విడుదల అయిన తర్వాత టాక్ తెలిశాక ఇంత సెంటిమెంట్ పిండుడు తెలుగు లో చాలా చూశామని ప్యాన్స్ కామెంట్స్ చేసి టిప్పి కొట్టారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కోసం విజయ్ కొద్దిగా కూడా సహకరించ కుండా హ్యాండ్ ఇచ్చాడు. హైదరాబాద్ రావడం కాదు కదా కనీసం ఇంటర్వ్యూ లు కూడా ఇవ్వలేదు. దానితో సినిమా మీద హైప్ క్రియేట్ కాక వసూళ్ళు మొత్తం డల్ అయ్యాయి. దానితో దిల్ రాజు ప్లాన్ మొత్తం తిరగబడింది