టాలీవుడ్ ఇండస్ట్రీలో నైజాం మార్కెట్ చాలా కీలకం. నైజాం మార్కెట్ కలిగిన హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది. ప్రస్తుతం మాత్రం హీరో మహేష్ బాబు సినిమాలు నైజాం ఏరియాలో కళ్ళు చెదిరే విధంగా ట్రేడ్ నిపుణులు ఆశ్చర్యపోయే విధంగా కలెక్షన్లు సాధిస్తున్నాయి. మహేష్ బాబు నటించినచివరి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ‘మహర్షి’ మరియు ‘భరత్ అనే నేను’ సినిమాలు దాదాపు నైజాం మరియు విశాఖలో 40 కోట్లకు పైగానే కలెక్ట్ చేయడంతో
ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా టాలీవుడ్ లెక్కల ప్రకారం 40 కోట్లకు పైగా ఆ రెండు ఏరియాలో పలకాల్సి ఉండగా రేటు కాస్త తగ్గి దిల్ రాజుకి ఉత్తరాంధ్ర మరియు నైజాం ఏరియాకు సంబంధించిన రైట్స్ కేవలం 30 కోట్లకు సరిలేరు నీకెవ్వరు సినిమా
యూనిట్ ఇచ్చినట్లు వార్తలు రావడం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ట్రేడ్ వర్గాలు కి చెందిన వాళ్ళు నిర్మాత దిల్ రాజు అదిరిపోయే జాక్ పాట్ సంక్రాంతికి కొట్టాడుగా అని కామెంట్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11 వ తారీకున రిలీజ్ కాబోతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై మహేష్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.