ట్రంప్ ఫ్లైట్ ఎక్కి వెనక్కి వెళ్లిపోయాక జగన్ కి అసలు విషయం తెలిసింది ?

-

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన చాలా విజయవంతంగా సాగింది. ఎక్కడా కూడా చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. డోనాల్డ్ ట్రంప్ రాక వల్ల పెట్టుబడులు మరియు రక్షణ ఆయుధాలు అగ్రిమెంట్లు ఇంకా అనేక విషయాలలో భారత్ కి బాగా లాభం చేకూరినట్లు ఇంటర్నేషనల్ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ తనకి మోడీకి మంచి బంధం ఈ పర్యటనతో ఏర్పడిందని ఆసియాలో భారత్-అమెరికాకి అత్యంత కీలకమైన మిత్ర దేశమని ఈ పర్యటన అనంతరం అమెరికా మీడియాకు డోనాల్డ్ ట్రంప్ చెప్పారట. Image result for jagan donald trump

ఇదిలా ఉండగా భారత్ పర్యటనలో డోనాల్డ్ ట్రంప్ కి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాజ్ భవన్ లో విందు ఇవ్వడం జరిగింది. ఈ విందుకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లలో కేవలం కేసీఆర్ కు మాత్రమే ఆహ్వానం అందడం జరిగింది. ఈ సందర్భంలో వైయస్ జగన్ కి ఆహ్వానం అందక పోవడం పట్ల గత కొన్ని రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా రంగంలో రకరకాల కథనాలు వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా టిడిపి నాయకుడు చంద్రబాబు జగన్ ఒక ఆర్థిక నేరస్థుడు పైగా సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నఅమెరికా అధ్యక్షుడితో భేటీ అయ్యే అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించడం జరిగింది.

 

29 రాష్ట్రాలలో కేవలం ఎనిమిది మంది ముఖ్యమంత్రులను మాత్రమే ఈ విందుకు ఆహ్వానించడం పైగా కేసీఆర్ ని మాత్రమే ఆహ్వానించడం వెనుక కారణం.., గతంలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఇవాంకా ట్రంప్ నిర్వహించిన అంతర్జాతీయ బిజినెస్ సమావేశాలలో దగ్గరుండి చూసుకోవడం తో కేసీఆర్ కి ఆహ్వానం అందినట్లు జగన్ కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర నుండి తెలుసుకున్నారట. ఈ క్రమంలో జగన్ కి ఆహ్వానం రాష్ట్రపతి భవనం నుండి పంపక పోవడం పట్ల వేరే ఉద్దేశం ఏమీ లేదని ట్రంప్ ఫ్లైట్ ఎక్కి వెనక్కి వెళ్లిపోయాక జగన్ కి అసలు విషయం తెలిసిందట.  

Read more RELATED
Recommended to you

Latest news