వాస్తు: ఈ దిశలో కిటికీలు వుండకూడదు.. ఇలా ఉంటే సమస్యలు తప్పవు..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి కిటికీలకు సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.

కిటికీలకి సంబంధించి చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు కానీ ఇంటిని నిర్మించుకునేటప్పుడు కిటికీలని ఏ దిశ లో ఉంచుకుంటే మంచిది అనే దాన్ని వాస్తు పండితులు సలహా తీసుకుని అప్పుడు మాత్రమే మీరు కిటికీలని కట్టుకోండి లేకపోతే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలామంది తెలిసి తెలియక ఇంటిని నిర్మాణం చేసుకుంటూ ఉంటారు అలా అసలు తప్పులు చేయకూడదు కొత్త ఇంటిని కట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కిటికీలని కట్టేటప్పుడు కిటికీలు ఎప్పుడు కూడా దక్షిణం వైపు ఉండకూడదు దక్షిణం వైపు యముడు దిక్కు. కాబట్టి దక్షిణం వైపున అసలు కిటికీలని పెట్టకూడదు ఒకవేళ కనుక ఈ దిశలో కిటికీలు ఉంటే దీని వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ఎఫెక్ట్ పడుతుంది.

ఒకవేళ కనుక మీ ఇంటి దక్షిణ వైపు కిటికీ ఉన్నట్లయితే కర్టెన్ ని ఒకటి కట్టండి. ఇలా చేయడం వలన నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అదే విధంగా కిటికీ వద్ద డిష్ లేదా యాంటీనా ఉంచకండి ఇది కూడా సమస్యలను తీసుకువస్తుంది కాబట్టి ఈ తప్పులను అస్సలు చేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news