Breaking : మునుగోడులో డిపాజిట్‌ దక్కించుకోలేని కాంగ్రెస్‌..

-

మునుగోడు బై పోల్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లంతైంది. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 13 రౌండ్లు పూర్తయ్యే సమయానికి 20వేల లోపు ఓట్లను మాత్రమే సాధించారు. దీంతో ఆమెకు ఎన్నికల డిపాజిట్ దక్కే అవకాశం లేదు. శాసనసభకు పోటీ చేయాలంటే రూ.10వేలను అభ్యర్థి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5వేలు చెల్లిస్తే చాలు. పోలైన మొత్తం ఓట్లలో అభ్యర్థికి కనీసం ఆరింట ఒక వంతు ఓట్లు రావాల్సి ఉంటుంది. అంటే 16.6 శాతం ఓట్లను అభ్యర్థి సాధించగలిగితే డిపాజిట్ సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. కానీ పాల్వాయి స్రవంతి 16.6 శాతం ఓట్లను సాధించలేకపోయారు. దీంతో ఆమె డిపాజిట్ ను దక్కించుకునే చాన్స్ ను కోల్పోయారు. మరోవైపు బై పోల్ 13వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది.

Congress finalises Palvai Sravanthi name for Munugodu by-polls

విజయం దిశగా ఆ పార్టీ దూసుకెళ్తోంది. 13 రౌండ్లు ముగిసే సరికి మొత్తం 9,039 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. మునుగోడు ఉప ఎన్నిక‌లో 2,41,805 ఓట్లకుగాను మొత్తం 2,25,192 ఓట్లు పోలయ్యాయి. పోలై చెల్లుబాటైన ఓట్ల‌లో 1/6 వంతు వస్తే డిపాజిట్ ద‌క్కిన‌ట్లుగా ప్రకటిస్తారు. అంతకంటే తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ కోల్పోయినట్లు. పాల్వాయి స్ర‌వంతి డిపాజిట్ ద‌క్కించుకోవాలంటే 37,532 ఓట్లు రావాలి. కానీ అన్ని ఓట్లు రాలేదు. కేవ‌లం 21 వేల పైచిలుకు ఓట్లే స్ర‌వంతికి పోల‌య్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news