Bholaa Shankar : భోళా శంక‌ర్ మెగా అప్డేట్! షూటింగ్ ఎప్పుడంటే?

-

Bholaa Shankar: మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ త‌ర్వ‌త వరుస సినిమాలతో బిజీ బిజీ అయ్యాడు. మెగా అభిమానుల‌ను అలరించేందుకు .. కుర్ర హీరోల‌కు ధీటుగా వరుస చిత్రాలను పట్టాలెక్కిస్తూ.. బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే చిరు ఆచార్య’ షూటింగ్​ ఇప్పటికే పూర్తి కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త‌గ్గేదేలే అన్న‌ట్లుగా మ‌రోవైపు..
చిరు మెహర్ రమేష్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నాడు.

ఆ సినిమాకు భోళా శంకర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‏ను ఫిక్స్ చేశారు నిర్మాతలు. త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన వేదాంళం అనే చిత్రానికి తెలుగు రీమేక్ గా భోళా శంక‌ర్ తెర‌కెక్కుతుంది. అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ చిత్రం నుంచి మ‌రో అప్డేట్ వ‌చ్చేసింది. ఈ రోజు ఉద‌యం ఉదయం7.45 నిమిషాలకు పూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు. ఈ నెల 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లుగా ప్రకటించాడు.

ఇప్ప‌టికే భోళా శంకర్ లుక్ టెస్ట్.. ఫోటో షూట్ స్టార్ట్ చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్. తాజాగా విడుదలైన ఫోటోలలో చిరు డిఫరెంట్ లుక్‏లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఫాం కోల్పోయిన డైరెక్ట‌ర్ మెహర్ రమేష్ కు మెగాస్టార్ కు ఛాన్స్ ఇవ్వ‌డ‌మేమిట‌ని, ఆయ‌న డైరెక్ట్ చేసినా.. కంత్రి, శక్తి, షాడో వంటి డిజాస్టర్లుగా మిగిలిన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news