‘పుష్ప’ సినిమా ముందు టాలీవుడ్, మలయాళం పరిశ్రమను మాత్రమే టార్గెట్ చేసి తీశారు. కాని తర్వాత ఎంతో కొంత రెవెన్యూ వస్తుందని హింది, కన్నడ మరియు తమిళంలో కూడా విడుదల చేసారు. మిగిలిన భాషలు ఏమోగాని, ఈ సినిమా హిందీలో మాత్రం ఊహించని వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాలో పాటలు , స్టైల్స్ అన్ని విపరీతంగా ఆదరణ పొందాయి.చాలా మంది క్రికెటర్లు కూడా పుష్ప మ్యానరిజంతో ఎన్నో వీడియోలు చేశారు. రీసెంట్ గా ఈ సినిమా ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది.
అయితే ఈ సినిమాపై దర్శకుడు తేజ గతంలో కొన్ని సంచలన కామెంట్లు చేశారు. ‘పుష్ప’ సినిమాను అందరూ హిట్ అన్నారని, కాని ఈ సినిమాకు అంతగా లాభాలు రాలేదని అన్నారు .అలాగే బాగా ఆడని ‘రాధేశ్యామ్’కి లాభాలొచ్చాయి అని ‘పుష్ప’, ‘రాధేశ్యామ్’ వసూళ్ల లెక్కలు చెప్పారు. దీంతో అల్లు అర్జున్ ఆర్మీ సోషల్ మీడియాలో చెలరేగిపొయి ట్రోల్ చేశారు. దీంతో తేజ మరో ఇంటర్వ్యూలో పుష్ప’ విడుదల సమయంలో తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయని చెప్పారు. అందువల్లే ఎక్కువ వసూళ్లు రాలేదని, ప్రభాస్ సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్లు విపరీతంగా పెంచేశారని దాంతో ఆ కలెక్షన్స్ ఎక్కువుగా కనిపించాయి అని కవర్ చేసే ప్రయత్నం చేశారు.
అలాగే తనకు దర్శకుడు సుకుమార్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. తన ఐడియాలు సూపర్ గా వుంటాయి అని చెప్పుకొచ్చారు. అలాగే ఓ సినిమా హిట్టూ, ఫ్లాపుల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. ఎందుకంటే నేను తీసిన సినిమాలన్నీ హిట్ కాలేదు,అలాగని ఫ్లాప్ కూడా కాలేదు. అందుకే నేను ఈ విషయాలు మాట్లాడకూడదు’’ అని తన మొదటి కామెంట్స్ పై వివరణ ఇచ్చారు.దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రతిస్పందిస్తూ, ఏమి కామెంట్స్ పెడతారో వేచి చూడాలి.