డైరెక్టర్ త్రివిక్రమ్ లో ఉన్న మరో మాజిక్ ..!!

-

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ప్రేక్షకులతో పాటు టెక్నీషియన్ లో, దర్శకులలో కూడా ప్రత్యేక మైన అభిమానం సంపాదించుకున్నారు. అందరూ ఆయన్ని గురూజీ గా పిలుచుకుంటారు. సినిమా పరిశ్రమ లో చాలా మంది స్ట్రగుల్ లో ఉంటే ఆయనతో కొంత సమయం కేటాయిస్తే చాలు హాయిగా ఫీల్ అవుతారు. ఇక ఆయన పెన్ను పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

రాజ మౌళి వంటి దిగ్గజం త్రివిక్రమ్ మాలాంటి మసాలా సినిమా తీస్తే దేశంలో టాప్ వుండే వారు అని వ్యాఖ్యానించారు అంటే అతని ప్రతిభ ను అంచనా వేయొచ్చు. ఇక ఆయన లో మరో కోణం పెద్ద పెద్ద హీరోలు కూడా ఆయన అడగ గానే వెంటనే డేట్స్ ఇచ్చివేస్తారు. ఆయన కూడా తన హీరోలను రిపీట్ చేస్తూ ఉంటారు. ఆయన తీసిన వారితోనే మళ్లీ మళ్లీ తీస్తూ వుండటంతో వారితో బలేగా రిలేషన్ పెరిగింది.

తాను పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, జూ ఎన్టీఆర్, వంటి వారితో సినిమాలు రిపీట్ చేస్తూ వచ్చారు. ఇక ఆయనకు అల్లు అర్జున్ అంటే విపరీతమైన ఇష్టం. వీరిద్దరు గతంలో అల వైకుంఠ పురంలో వంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. బన్నీ నెక్ట్స్ చేయబోయేది స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌తోనే అని తెలుస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేశ్ బాబు సినిమా తో బిజీ గా ఉన్నారు. ఇది అయిన తరువాత ఆ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు

Read more RELATED
Recommended to you

Latest news