‘అజిత్‌ 62’ మూవీ నుంచి డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఔట్.. ఇదిగో ప్రూఫ్..!

-

అజిత్ 62 సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ అవ్వడంతో ఇంకా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి వస్తున్న ఓ వార్త చూసి అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

గతేడాది విడుదలైన ‘కాతువాకుల రెండు కాదల్‌’తో ప్రేక్షకులను అలరించారు విఘ్నేశ్. ఈ సినిమా తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌ను స్టార్‌ హీరో అజిత్‌(Ajith)తో చేస్తున్నట్లు ఓ సందర్భంలో చెప్పారు. అజిత్‌ 62(AK 62)వ చిత్రంగా లైకా ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఇది పట్టాలెక్కనున్నట్లు గతంలో ప్రకటన విడుదలైంది. ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే రోజు కోసం అజిత్‌ అభిమానులు ఆశగా ఎదురుచూస్తోన్న తరుణంలో విఘ్నేశ్‌ ఈ సినిమా నుంచి వైదొలగినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

తాజాగా విఘ్నేశ్‌ శివన్‌ సైతం తన ట్విటర్‌ బయో నుంచి AK 62 అనే పేరును తొలగించారు. దీంతో ఈ సినిమా గురించి ఇప్పటివరకూ వచ్చిన వార్తలు నిజమేనని అభిమానులు భావిస్తున్నారు. ఈ జోడీ ఇప్పటికి కుదరనట్టేనా? అని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు అజిత్‌ – విఘ్నేశ్‌ శివన్‌ ప్రాజెక్ట్ కొనసాగుతుందా? లేదా? అనే విషయంపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news