చెక్ సినిమాపై కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్న దర్శకుడు.. బిగ్ బ్యానర్ లో నెక్స్ట్ మూవీ..

Join Our Community
follow manalokam on social media

తెలుగు సినిమాల్లో అండర్ రేటెడ్ దర్శకుడిగా ఉన్న దర్శకులలో నంబర్ వన్ స్థానంలో ఉన్నది చంద్రశేఖర్ యేలేటి అని చెప్పవచ్చు. ఆయన చేసిన ప్రతీ సినిమా, ఒక్కో రకంగా ఉండి ప్రేక్షకులని సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఆయన సినిమాల ద్వారా ముద్ర వేయగలైగాడే గానీ, విజయాలు మాత్రం అందుకోలేకపోయాడు. ఐతే ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి నుండి చెక్ సినిమా వస్తుంది. నితిన్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 26వ తేదీన థియేటర్లలోకి రానుంది.

ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ యేలేటి చెక్ సినిమాపై మంచి ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని తనకి మరిన్ని అవకాశాలని తెచ్చిపెడుతుందని అంటున్నాడు. ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో పేరొందిన మైత్రీ మూవీ మేకర్స్ నుండి అవకాశం వచ్చిందని తెలుస్తుంది. చెక్ సినిమా హిట్ అయితే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందట. మరి ఈ సారైనా చంద్రశేఖర్ యేలేటికి సరైన హిట్ అందుతుందేమో చూడాలి.

TOP STORIES

EPF: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్… వివరాలు ఇవే…!

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అనేది జీతం ఉన్న వ్యక్తుల కోసం ప్రభుత్వ యాజమాన్యం తో నడిచే పెన్షన్ ప్లాన్. దీంతో ప్రతి నెల 12...