మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా.. నాగ్ పూర్ లో నైట్ కర్ఫ్యూ..?

-

మహారాష్టలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. వరుసగా రెండు రోజుల పాటు 6వేల కేసులకి పైగా రావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. శనివారం రోజున ముంబైలో 897కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతుంది. లాక్డౌన్ లాంటివి కంటిన్యూ చేయాలని చూస్తోంది. ప్రస్తుతానికి రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని అనుకుంటుంది. నాగ్ పూర్, అమరావతి మొదలగు ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

corona-virus
corona-virus

అకోలా వంటి ప్రాంతాల్లో లోకల్ లాక్డౌన్ విధించే ఏర్పాట్లు జరగనున్నాయట. ఐతే ఈ సారి లాక్డౌన్ పూర్తిగా 24గంతలు కాకుండా కేవలం 12గంటలు మాత్రమే ఉండేలా చూస్తారట. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు చూస్తుంటే మళ్ళీ జనాల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ ఏమైనా వచ్చిందా అని దిగులు పడుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర నుండి ఇతర రాష్ట్రాలకి వెళ్ళేవారికి అనేక నియమ నిబంధనలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news