లాక్డౌన్ కారణంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లకి డిమాండ్ బాగా పెరిగింది. థియేటర్లు మూసి ఉండడంతో సినిమాలన్నీ ఓటీటీ ద్వారా ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చాయి. ఐతే అటు ఓటీటీ ఛానల్స్ దూసుకుపోతుంటే ఏటీటీ అంటూ సరికొత్త ఫ్లాట్ ఫామ్ లైన్లోకి వచ్చింది. ఎనీ టైన్ థియేటర్ అనే కాన్సెప్ట్ తో, సినిమా చూడాలంటే కొంత మేర డబ్బులు కట్టాల్సిందని వచ్చిన ఈ ఫ్లాట్ ఫామ్ కి మొదట్లో మంచి స్పందన లభించింది. ఆ తర్వాత మెల్లగా దీన్ని పట్టించుకునేవారు కరువయ్యారు.
ఐతే తాజాగా ఈ ఫ్లాట్ ఫామ్ లో సూపర్ హిట్ సినిమా వచ్చింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం వంటి సినిమాల నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన బోల్డ్ మూవీ డర్టీ హరి, ఫ్రైడే మూవీస్ ద్వారా విడుదలైంది. రూ 120పెట్టి చూడాల్సిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. గడిచిన 24గంటల్లో 91,818వ్యూస్ వచ్చాయి. ఈ లెక్క ప్రకారం ఇప్పటి వరకు కోటి పది లక్షలు కలెక్ట్ అయినట్టు లెక్క. మినిమం బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం అంటే సూపర్ హిట్ కిందే లెక్క.