ఐఏఎస్ ల మీద టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

-

 ఏపి గ్రామ సచివాలయం ఏంప్లాయిస్  ఫెడరేషన్  సమావేశంలో  పాల్గోన్న ఎమ్మెల్యే  వాసుపల్లి గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతానికి ఇప్పటికే గవర్నెస్ లో సముద్రంత మార్పు కనిపిస్తుందని  జగన్ సముద్రమైతే,  చంద్రబాబు నాయుడు పిల్ల కాలువ అని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు వద్దకు ఏ లేఖలు పట్టుకెళ్లినా  ఐఏఎస్ ల ముందు పడేసేవారని, ఐఏఎస్ లు స్టూపెడెటితో రిజీడిటితో ఉంటారని, పని చేయరని ఎమ్మెల్యే  వాసుపల్లి గణేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

హూదూద్ సమయంలో చంద్రబాబు కోన్ని బోట్లు పోయాయని వెళితే మత్స్యకారులకు సాయం చేయలేదని అంటూ బ్లడీ బగ్గర్ చంద్రబాబు అంటూ ఆయన పరుషంగా మాట్లాడినట్టు సమాచారం. ఇక మొన్నటి ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నుండి గెలిచినా వాసుపల్లి గణేష్ అనంతరం జగన్ కు జై కొట్టారు. ప్రస్తుతం తెలుగుదేశం నుండి ఎన్నికయిన ఆయన అసెంబ్లీలో కూడా అటూ ఇటూ కాకుండా వంశీ, కరణం బలరామ్ లతో కలిసి వేరే చోట కూర్చుంటున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news