దొర‌సాని రూమ్ లో ఏడ్చిందా?

-

దొర‌సాని సినిమా పైన ప‌టారం..లోన లొటారం అని తొలి షోతోనే తేలిపోయింది. ఔడెటెడ్ కంటెంట్ ని తీసుకుని గొప్ప సినిమా అంటూ ప్ర‌మోట్ చేసి చివ‌రికి అబాసుపాల‌య్యారు. క్రిటిక్స్ సినిమాను విశ్లేషించ‌డం చేత‌కాదు అంటూ చిత్ర నిర్మాత మ‌ధుర శ్రీధ‌ర్ పంచులేసాడు. స‌రే అదంతా ఆయ‌న వ్య‌క్తిగ‌తం అనుకోండి. అయితే సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే సినిమా స‌క్సెస్ మీట్ ఏర్పాటు చేసి బూస్టింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. మ‌రి బూస్టింగ్ ఎంత‌వ‌ర‌కూ క‌లిసొస్తుందో తెలియ‌దు గానీ! ఇందులో హీరోయిన్ గా న‌టించిన జీవితరాజ‌శేఖ‌ర్ చిన్న కూతురు శివాత్మిక మాత్రం బాగా అప్స‌ట్ అయిందిట‌. న‌టిగా ఆమె కు పాస్ మార్క‌లు ప‌డినా…సినిమాలో మ్యాట‌ర్ లేక‌పోవ‌డంతో అంద‌రి ఎఫెర్ట్ వృద్ధా అయింది.

ఎన్నో ఆశ‌ల‌తో ఇండ‌స్ర్టీలో కి అన్న త‌ర‌హాలో హీరో అవుదామ‌ని ఆమెరికా నుంచి ల‌గెత్తుకొచ్చినా ఆనంద దేవ‌ర‌కొండ‌కు నిరాశ త‌ప్ప‌లేదు. అయితే వీళ్లంతా ఫెయిల్యూర్ ని బ్యాలెన్స్ చేయ‌గ‌లిగారు. కానీ శివాత్మిక మాత్రం సినిమా టాక్ నెగిటివ్ గా రావ‌డం…రివ్యూలు అనుకూలంగా లేక‌పోవ‌డంతో ఎమోష‌న్ అయిందిట‌. ఆ ఎమోష‌న్ మ‌రీ పీక్స్ చేరుకోవ‌డంతో రూమ్ లో ఒంట‌రిగా కూర్చొని ఏడ్చేసింద‌ట‌. మ‌రి అంత ఎమోష‌న్ అయ్యేంత సీన్ అక్క‌డ లేక‌పోయినా అది వార‌స‌త్వంగా వ‌చ్చిన అల‌వాటు ప్ర‌కారం అలా జ‌రిగిపోయింద‌ని అంటున్నారు.

నిజ‌మే కొన్ని సంద‌ర్భాల్లో మీడియా ముందే చాలాసార్లు జీవితరాజ‌శేఖ‌ర్ ఎమోష‌న‌ల్ అయ్యారు. ముఖ్యంగా రాజ‌శేఖ‌ర్ అయితే ఆరేళ్ల బాలుడైపోతాడు. ఆవిష‌యంలో శివాత్మిక‌ ఆయ‌నకు చాలా ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని తాజా స‌న్నివేశాన్ని బ‌ట్టి తెలుస్తోంది. అయినా ఏ రంగంలోనైనా స‌క్సెస్ లు..ఫెయిల్యూర్స్ స‌హ‌జం. హిట్ అయితే రెండ‌వ చాన్స్ తొంద‌గ‌రా వ‌స్తుంది. లేదంటే ఛాన్స్ కోసం శ్ర‌మించాల్సి ఉంటుంది. ఆ మాత్రం బ్యాలెన్సింగ్ లేక‌పోతే ఎలా. శివాత్మిక బాలీవుడ్ లో క‌ర‌ణ్ జోహార్ బ్యాన‌ర్లో సినిమా చేయాల‌నుకుంటుంది. ఇది ఆమె జీవితాశం. మ‌రి ఇలా మొద‌టి సినిమాకే నీరు గారి పోతే ఎలా అమ్మ‌డు.

Read more RELATED
Recommended to you

Latest news