ర‌క్షిత్ అమాయ‌కుడా! త‌ప్పంతా ర‌ష్మిక‌దేనా?

1029

ముంబై మోడ‌ల్స్ త‌ర‌హాలో తెర‌పై వాస్త‌వికంగా ఆ రెచ్చిపోవ‌డం ఏంట‌ని సీరియ‌స్ అయ్యారుట‌. కానీ ర‌ష్మిక ఆ మాట‌ల‌ను పెడ‌చెవిన పెట్టిన‌ట్లు స‌ద‌రు వైబ్ సైట్ పేర్కొంది.

టాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చింది క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న‌.’ఛ‌లో’ హిట్ తో కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగిపోతుంది. అనతి కాలంలో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తోంది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో డియ‌ర్ కామ్రేడ్, మ‌హేష్ బాబు స‌ర‌స‌న స‌ర‌స‌న స‌రిలేరు నీకెవ్వ‌రులో,నితిన్ తో భీష్మ‌, అల్లు అర్జ‌న్ 20వ సినిమాలోనూ న‌టిస్తోంది. అయితే విజ‌య్ తో గీతాగోవిందంలో న‌టించ‌డంతో అమ్మ‌డికి మ‌రింత గుర్తింపు వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఇద్ద‌రు మంచి స్నేహితులైపోయారు. ఇద్దరి మ‌ధ్య స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ అనే వార్త‌లు వ‌చ్చాయి. ఆ కార‌ణంగా ప్రేమించిన చెలికాడు ర‌క్షిత్ శెట్టిని దూరం పెట్టింద‌ని….ఇలా నాలుగైదు నెల‌ల‌క్రితం పెద్ద ర‌చ్చే జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

Rashmika mandanna father madan mandanna is angry on her
Rashmika mandanna and her father madan mandanna

ఈ మొత్తం వ్వ‌వ‌హారంలో ర‌ష్మిక త‌ల్లి సుమ‌న్ మంద‌న పాత్ర అత్యంత కీల‌క‌మైన‌ది. ర‌ష్మిక పీక‌ల్లోతు బాధ‌లో ఉన్న‌ప్పుడు మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చింది సుమ‌న్ మంద‌నే. ఆ స‌మ‌యంలో ర‌ష్మిక తండ్రి మ‌ద‌న్ మాత్రం మౌనం వ‌హించారు. ఇదంతా గ‌తం. అయితే తాజాగా ర‌ష్మిక వ్వ‌హారిక శైలిపై తండ్రి చాలా సీరియ‌స్ గా ఉన్నాడుట‌. అందుకు ర‌ష్మిక యాట్యుట్యూడే కార‌ణ‌మ‌ని ఓ క‌న్న‌డ వెబ్ సైట్ల ఓ వార్త వ‌చ్చింది. ర‌ష్మిక త‌ల్లి మాట త‌ప్ప‌! తండ్రి మాట విన‌దని అందులో రాసారు. త‌ల్లీకూతుళ్లిద్ద‌రు ఒక‌టిగా తండ్రిని వేరు చేసే ప్ర‌యత్నం చేస్తార‌ని రాసుకొచ్చింది. ఇక డియ‌ర్ కామ్రేడ్ లో ర‌ష్మి హీరోతో విచ్చ‌ల విడిగా పెద‌వి ముద్దు స‌న్నివేశాల్లో న‌టించ‌డంపై మంద‌న్ అసంతృప్తిని వ్య‌క్తం చేసారుట‌.

Rashmika mandanna father madan mandanna is angry on her
Rashmika mandanna with her ex-boyfriend rakshit shetty

ముంబై మోడ‌ల్స్ త‌ర‌హాలో తెర‌పై వాస్త‌వికంగా ఆ రెచ్చిపోవ‌డం ఏంట‌ని సీరియ‌స్ అయ్యారుట‌. కానీ ర‌ష్మిక ఆ మాట‌ల‌ను పెడ‌చెవిన పెట్టిన‌ట్లు స‌ద‌రు వైబ్ సైట్ పేర్కొంది. ర‌క్షిత్ శెట్టి విష‌యంలోనూ మ‌ద‌న్ కూతురినే త‌ప్పు బ‌ట్టిన‌ట్లు ప‌రోక్షంగా వెల్ల‌డించింది. మ‌రి ఇందులో నిజ‌మెంత‌? అన్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది. అయినా సినిమా ఫీల్డ్ లో ఇవ‌న్నీ స‌హ‌జం. ప్రేమ‌లు..బ్రేక‌ప్ లు…మ‌ళ్లీ ప్రేమించ‌డం స‌హ‌జంగా జ‌రిగేవి.

Rashmika mandanna father madan mandanna is angry on her