జులై 15 రాశి ఫలాలు: అకస్మాత్‌గా వచ్చే సందేశం ఈ రాశికి ఆనందాన్ని కలిగిస్తుంది..!

-

జూలై 15 సోమవారం – రోజువారి రాశిఫలాలు

మేషరాశి: కుటుంబంతో కలిపి సామాజిక కార్యక్రమాలు అమితమైన ఆనందాన్నిస్తాయి. ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. మీ ఖర్చులను అదుపు చెయ్యండి. ఈ రోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చుఅయిపోకుండా చూసుకొండి. ప్రేమ, రొమాన్స్ మిమ్మల్ని సంతోషకరంగా ఉంచుతాయి. మీ అభిలాషకు తగినట్లుగా కెరియర్ నిర్ణయాలు తీసుకొండి, అవి ప్రయోజనకరమైన ఫలితాలను అందిస్తాయి. ఒకవేళ షాపింగ్ కి వెళితే, మీకోసం మీరు మంచి డ్రెస్ ని తీసుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తో కలిసి మీరు మీ టీనేజీ రోజుల్లోకి వెళ్లిపోతారు.
పరిహారాలు: పరిశుభ్రంగా ఉండటం, రోజువారీ స్నానం చేయడం ద్వారా ఆర్థిక జీవితం ఉత్తమంగా ఉంటుంది.

వృషభరాశి: జీవితంపట్ల ఉదార ఉదాత్తమైన ధోరణిని పెంపొందించుకొండి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి, ధనం తాజాగా ప్రవహిచగలదు. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అవి మిమ్మలని బాగా పరపతిగల వ్యక్తులను దగ్గర చేయవచ్చు. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాల్లోని గత స్టేటస్ లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ ప్రైజ్ దొరుకుతుంది. రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. ఈ రోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు గాక. కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు.
పరిహారాలు: వృత్తిలో విస్తరణ కోసం, పిల్లలకు పెసరతో తయారు చేసిన తీపి, లవణంగల వంటకాలను ముఖ్యంగా యువకులకు పంపిణీ చేయండి.

మిథునరాశి: దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, మదుపు చెయ్యడం అవసరం. సామాజిక కార్యక్రమాలు, వినోదమే,కానీ మీరు మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మానాలి. అనుకోను నరాల పనిచేయనితనం, మీ రోగనిరోధక శక్తిని, ఆలోచనా శక్తిని బలహీన పరుస్తుంది. సానుకూల దృక్పథంతో మీకు మీరే ఈ వ్యాధిని ఎదిరించడానికి ప్రోత్సహించుకొండి. ప్రేమలో విజయం సాధించడానికి, ఎవరోఒకరికి తనని తాను గుర్తించేలాగ సహాయం చెయ్యండి. ఈ రోజు, చాలా చురుకుగా ఉంటుంది. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే, అవి పోవడంకానీ, దొంగతనంకానీ జరగవచ్చును. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు.
పరిహారాలు: శుభ,ఆరోగ్య ప్రయోజనాలు కోసం గంగాజలాన్ని ఉపయోగించండి

కర్కాటకరాశి: కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. పని మధ్యలో కొంతసేపు విశ్రాంతిని తీసుకొని, రిలాక్స్ అవడానికి ప్రయత్నించండి. మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చును, అవి భవిష్యత్తులో విలువ పెరగ వచ్చును. మీ శ్రీమతి తరఫు బంధువులు రాక ఆటంకం కలిగించడం వలన, మీ రోజు ప్లాన్ ఖరాబు అయిందని అప్‌సెట్ అవుతారు. మీ కృషి ఈ రోజు ఆఫీసులో మీకు గుర్తింపు తేనుంది. శాస్ర్తోక్తమైన కర్మలు/ హోమాలు/ పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించే అవకాశం ఉంది. ఇతరుల జోక్యం ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేస్తుంది.
పరిహారాలు: మీ సోదరిని ప్రేమించడం, గౌరవించడం ద్వారా ప్రేమ జీవితం మెరుగుపరచండి.

సింహరాశి: మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మనుషులు మీకు బోలెడు ఆశలు కలలు కలిగించవచ్చును- కానీ మీ పరిశ్రమ పైనే అంతా ఆధారపడి ఉంటుంది. మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయే ఎగ్జైట్ మెంట్ ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే, మరీ అతి సంతోషంకూడా సమస్యలకు దారితీయవచ్చును. గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో ప్రతి ఒక్కరూ ఈ రోజు మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్ గా వింటారు. ఈ రోజు మీరెలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలుపడానికి ఆత్రుతపడకండి. ఈ రోజు మీ జీవితభాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు.
పరిహారాలు: బలమైన కుటుంబ సంబంధాలు కోసం శివాభిషేకం చేయండి.

కన్యారాశి: జీవితం మీదని విర్రవీగకండి, జీవితం భద్రతపట్ల దృష్టి పెట్టడం ముఖ్యం. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. మీరు ప్రేమించే వారితో వచ్చిన అపార్థాలు తొలగిపోతాయి. మీ డార్లింగ్ తో కొంత విభేదం తలెత్తవచ్చు. మిగతా అన్ని రోజుల కన్నా మీ తోటి సిబ్బంది ఈ రోజు మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు. సంఘటనలు, మీకు అనుకూలంగా ఉండేలాగ కనిపిస్తుండడంతో లాభదాయకమైన రోజు. ఇక మీరు విశ్వ విజేతలవుతారు అన్నమాటే. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు.
పరిహారాలు: హనుమాన్ చాలిసా పఠనం ఆరోగ్యానికి ఫలవంతమైన ఫలితాలు తెస్తుంది

తులారాశి: ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్లనించి తప్పిస్తుంది. శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి, మానసిక దృఢత్వం కోసం ధ్యానం , యోగా చెయ్యండి. బిజినెస్ అప్పుకోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి. కేవలం శ్రోతలాగ మిగిలిపోకుండా, మీరుకూడా వీటిలో పాల్గొనడం మానకండి. భాగస్వాములు మీ క్రొత్త పథకాలు, వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి తో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి.
పరిహారాలు: మంచి ఆర్ధిక జీవితాన్ని కాపాడుకోవడం కోసం శివునికి గంగాజల అభిషేకం చేయండి.

వృశ్చికరాశి: మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటికిపోయే ద్రవ్యం మి ప్రాజెక్టులను అమలుచేయడంలో అడ్డంకులు కలిగించవచ్చును. మీ సంకల్ప బలం తో ఒక తికమక పరిస్థితిని ఎదుర్కోవడంవలన అది ప్రశంసలను పొందుతుంది. ఒక ఉద్వేగభరితమైన నిర్ణయం తీసుకునే సమయంలో, మీరు సంయమనాన్ని పోగుట్టుకోరాదు. ఒకవేళ మీరు ప్రతిఒక్కరి డిమా్ండ్‌ని గురించి జాగ్రత్త తీసుకోవాలంటే కుదరదు. జంతా ప్రేమసంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. పనిలో నెమ్మదిగా వచ్చే అభివృద్ధి తక్కువ టెన్షన్‌లని కలిగిస్తుంది. విహార యాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి.
పరిహారాలు: వృత్తి జీవితాన్ని, వ్యాపారాన్ని వృద్ధి కోసం శివాలయంలో పంచామృత అభిషేకం చేయించండి.

ధనస్సురాశి: మీరు భయం అనే భయంకరమైన రాక్షసునితో పోరాడుతున్నారు. మీ ఆలోచనలను సానుకూలంగా మలచుకొండి. మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిన ఖర్చులవలన దాచుకోలేకపోతారు. స్నేహితులు, బంధువులు, మీనుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు, కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి, మీకు మీరు దర్జాగా గడపవలసిన సమయం. మీరు మన్నించతగినది అని విశ్వసిస్తే తప్ప ఏ కమిట్‌మెంట్‌నీ చేయకండి. మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి, దీర్ఘకాలిక విషంలా పనిచేస్తుంది. మీరు ఏదో ఒక మంచి పనిని చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. అనరోగ్య సూచన ఉంది. జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు.
పరిహారాలు: పవిత్రమైన ఆరోగ్య ఫలితాలను పొందటానికి రావి చెట్టుకు నీటిని పోయండి. నెయ్యి దీపం వెలిగించండి.

మకరరాశి: మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు. ప్రకాశింపచేయగలదు. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది. మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆచంద్రతారార్కమూ ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఈ రోజు మీరెలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలుపడానికి ఆత్రపడకండి. మీరు, మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు.
పరిహారాలు: మీ ఆర్థిక అవకాశాలను పెంచుకోవడానికి వెండి గాజును ధరించండి.

కుంభరాశి: ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే క్రుంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచితెలిసినట్లు, కొంత విచారం ఉండడం అవసరం. అలాగ ఉన్నప్పుడే, మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయి మీ మూడ్‌ని మార్చుకొండి. రియల్ ఎస్టేట్ పెట్టుబడి అత్యధిక లాభదాయకం. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డ్‌లను తెస్తుంది. ఈరోజు, గ్రహచలనం రీత్యా, ప్రేమ వ్యవహారాలలో వ్యాకులత కానవస్తున్నది. మీ అభిలాషకు తగినట్లుగా కెరియర్ నిర్ణయాలు తీసుకొండి, అవి ప్రయోజనకరమైన ఫలితాలను అందిస్తాయి. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
పరిహారాలు: ప్రేమ జీవితం నీలి బూట్లు ధరించడం ద్వారా బలపడుడుతుంది.

మీనరాశి: మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి.- అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది అందరినీ ఒకచోట చేర్చిఒకే లక్ష్యం కోసం పనిచేసేలాగ టీమ్ వర్క్ చేయడానికిగాను, శక్తివంతమయిన పొజిషన్‌లో ఉంటారు. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి- మీరు కూర్చుని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. జీవిత భాగస్వామి సంతోషకరంగా గడుపుతారు.
పరిహారాలు: వృత్తిలో అభివృద్ధి చెందటం కోసం ఉదయాన్నే సూర్యుడిని ప్రార్థించండి , గాయత్రీ మంత్రాన్ని 11 సార్లు పఠించండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news