దిశ కేసులో బిగ్ ట్విస్ట్ : నోటీసులు జారీ చేసిన సిట్ కమిషన్

నారాయణపేట జిల్లా : సంచలనం సృష్టించిన దిశ కేసు లో సిట్ కమీషన్ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యం లోనే దిశ ఘటనలో ఎన్ కౌంటర్ అయిన నలుగురు చదువుకున్న స్కూళ్ల కు సిట్ కమీషన్ నోటీసులు జారీ చేసింది. మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లేర్ గ్రామాల పాఠశాల సిబ్బందికి, ఎన్ కౌంటర్ కాబడిన నలుగురు కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు అందజేశారు సిట్ కమీషన్ తరుపు న్యాయవాది.

కస్టోడియల్ డెత్ గైడ్ లైన్స్ ప్రకారం న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించారు బాదిత కుటుంబాలు. అయితే కోవిడ్ మహమ్మారి తీవ్రత కారణంగా సిట్ కమీషన్ విచారణ లో జాప్యం జరిగింది. అయితే తాజాగా దిశ కేసు లో సిట్ కమీషన్ విచారణ చేపట్టింది. దీంతో తమకు , తమకు కుటుంబాలకు జరిగిన అన్యాయం గురించి కోర్టులో చెప్పు కునే అవకాశం బాదిత కుటుంబాలకు దొరికింది. కాగా రెండేళ్ల కింద ప్రియాంక రెడ్డి హత్య కేసులో ఈ నలుగురు ఎన్ కౌంటర్ అయిన సంగతి తెలిసిందే.