ఆ పిటిషన్‌ను కొట్టివేయడం కేసీఆర్‌కు చెంప పెట్టులాంటింది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

-

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు కోసం హైకోర్టుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చుక్కెదురైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.సోమవారం అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేయడం కేసీఆర్‌కు చెంప పెట్టులాంటిందని అన్నారు.కేసీఆర్ వాస్తవాలను దాచి పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. చట్టం ముందు అందరూ సమానమే అని అన్నారు. రాజ్యాంగబద్దంగా ఏర్పాటు చేసిన కమిషన్‌ను రద్దు చేయాలనే సాహసం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.

కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరై వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని అన్నారు.10 సంవత్సరాలలో తుగ్లక్ నిర్ణయాలు తీసుకోవడం వలనే రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. కమిషన్ విచారణలో తప్పుతేలితే, కేసీఆర్ శిక్ష అనుభవించాల్సిందేనని అన్నార. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విసిరిన సవాల్ పైనే ప్రభుత్వం విచారణ జరుపుతోందని తెలిపారు. ఏ విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరి పారిపోతారా..? అంటూ మండిపడ్డారు

.

Read more RELATED
Recommended to you

Exit mobile version