టీడీపీకి కంచుకోట వంటి జిల్లా అనంతపురం. ప్రస్తుతం ఈ జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఎవరికి వారు మౌనంగా ఉంటున్నారు. మరికొందరు పార్టీ మారిపోయారు. దీంతో టీడీపీ అంటేనే ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో చంద్రబాబు తాజాగా నేతలను గాడిలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారుయాలు వెలుగు చూశాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి కుటుంబం పార్టీ మారేందుకు రెడీ అవుతోంది. అదే సమయంలో పరిటాల ఫ్యామిలీ కూడా బీజేపీ వైపు చూస్తోంది. ఇక, పీఏసీ చైర్మన్‌గా ఉన్న పయ్యావుల కేశవ్‌కు వైఎస్సార్ సీపీ నుంచి ఇప్పటికి రెండు సార్లు ఆహ్వానాలు అందాయి.
ఈ క్రమంలోనే జిల్లా పరిస్థితిని ఆయన తెప్పించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు కీలకమైన విష
ఇప్పటికే శింగనమలలో సీనియర్ కుటుంబం. టీడీపీలో అన్నగారి హయాం నుంచి చక్రం తిప్పుతున్న శమంతకమణి ఫ్యామిలీ కూడా పార్టీ మారింది. ధర్మవరంలోనూ వరదాపురం సూరి పార్టీ మారిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నవారినైనా కాపాడుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే,ఇది ఒకరిపై ఒకరంటే పడని నాయకులకు మంటపుట్టిస్తోంది. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై జేసీ వర్గం పైచేయిగా ఉంది. దీనిని పరిశీలించి.. చక్కదిద్దాలని ఆయన ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ, చంద్రబాబు జేసీ వర్గాన్ని సముదాయించలేక పోతున్నారు. అర్బన్‌లో వేలు పెట్టద్దు.. అంటే.. జేసీ వర్గం ఏకంగా పార్టీ మారతామని చెప్పేందుకు రెడీ అవుతోంది.
పోనీ.. ప్రభాకర్‌కు చెబుతామంటే.. ఆయన ఒక్కరే పార్టీలో కొంచె యాక్టివ్‌గా ఉన్నారు. ఇక, పరిటాల కుటుంబం పరిస్థితి కూడా ఇంతే. మీరెందుకు యాక్టివ్‌గా లేరు.. అంటే.. మాకు పెనుకొండ కూడా ఇవ్వండి అంటున్నారు. కానీ, చంద్రబాబు దీనికి ఒప్పుకోవడం లేదు. దీంతోఈ కుటుంబాన్ని బలవతంగా ధర్మవరం పంపితే.. ఎక్కడ పార్టీ మారుతారోనని ఆయన భయపడుతున్నారు. శింగనమలలో పార్టీ జెండా మోసేవారు లేరు. అక్కడ కూడా తమకు ఆధిపత్యం కావాలని జేసీ వర్గం కొన్నాళ్ల కిందట ప్రతిపాదించింది. ఆయనకు ఇస్తే.. మా పరిస్థితేంటని ఇక్కడి తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇక, పయ్యావుల సైలెంట్‌పై కూడా చంద్రబాబు ఏమీ చేయలేక పోతున్నారు. ఇలా.. ఒకరిని కదిలిస్తే.. మరొకరు ఆగ్రహంతో ఉండడంతో అనంత టీడీపీలో పరిస్థితి దారుణంగా ఉందనే వార్తలు వస్తున్నాయి.