రోజా శృంగారం, వ్యభిచారం అంటూ దివ్యవాణి సంచలనం !

నిన్న ఏపీ వైసీపీ మహిళా ఫైర్ బ్రాండ్ రోజా చంద్రబాబు ని టార్గెట్ చేసి మరీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ క్రమంలో ఆమె మీద టీడీపీ నేత, సినీ నటి దివ్యవాణి ఫైర్ అయ్యారు. అంతేకాక ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి రోజా కెక్కడిది ? అని ప్రశ్నించిన ఆమె మనస్సాక్షి లేని చెత్త నోరుతో మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని అన్నారు. తాను చేస్తే శృంగారం ఎదుటివారు చేస్తే వ్యభిచారం అన్న శైలి రోజా కి తగదు అంటూ ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం లో ఉన్నప్పుడు వైఎస్సార్, కేసీఆర్ ల గురించి చేసిన విమర్శలు గుర్తు లేదా ? అని ఆమె విమర్శించారు. శవరాజకీయాలు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న వైకాపాలో ఉండి రాజకీయ సంప్రదాయాల గురించి రోజా మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆమె అన్నారు.

వైకాపా నేతలు సీజనల్ వ్యాధులు లాంటి వారన్న ఆమె ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్టిని మళ్లించడానికి అప్పుడప్పుడు బయటకు వచ్చి హడావిడి చేయడం ఆనవాయితీగా మారిందని అన్నారు. తిరుపతి ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి గురించి రోజా మాట్లాడటం నీచ రాజకీయం అని ఆమె అన్నారు. నంద్యాల ఉపఎన్నికలో జగన్ ఎందుకు అభ్యర్థిని నిలబెట్టారు ? అని ప్రశ్నించారు. స్థానిక ఎంపీ చనిపోతే తిరుపతి వెళ్లి కూడా బల్లి దుర్గాప్రసాద్ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని, దుర్గాప్రసాద్ కొడుక్కి ఎందుకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు ? అని ఆమె ప్రశ్నించారు. మండలి రద్దు నిర్ణయం ప్రకటించి ఎమ్మెల్సీ ఇస్తాననటం మోసం కాదా ? అని ఆమె ప్రశ్నించారు. ఎస్సీల పట్ల జగన్ కు ఎంత చిన్నచూపో దీనిబట్టి అర్థమవుతోందని అన్నారు.