తెలుగు సినిమాల్లో సాధారణంగా హీరోలే హైలైట్ అవుతుంటారు. హీరోని దాటి హీరోయిన్లు హైలైట్ అయ్యే సందర్భాలు కూడా తక్కువగా ఉంటాయి. అలాంటిది వారిద్దరినీ దాటుకుని, ఒక ఆర్టిస్ట్ లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఆయనే గోపరాజు రమణ గారు. ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంలో తండ్రి పాత్రలో నటించిన రమణ గారికి ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
మధ్యతరగతి తండ్రి ఎలా ఉంటాడో అలా కనిపించిన రమణ గారికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. గుంటూరు యాస, మధ్య తరగతి జీవితాన్ని ప్రతిబింబించేలా నటన.. అన్నీ కలిసి రమణ గారి పాత్రకి మంచి హైప్ తీసుకువచ్చాయి. రమణ గారు పలికిన డైలాగులు సైతం మనకి గుర్తుండిపోయేలా ఉన్నాయంటే, ఎంత బాగా మెప్పించారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ మంచి హిట్ అందుకున్నాడు. కానీ అంతకంటే పెద్ద హిట్ రమణ గారు దక్కించుకున్నారు.