తప్పు చేశారు కాబట్టే శిక్ష.. రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై డీకే అరుణ

-

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై ప్రతిపక్షాలు మండిపడుతుండగా.. మరోవైపు బీజేపీ శ్రేణులు లోక్ సభ నిర్ణయాన్ని సమర్థిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయాపాధ్యక్షురాలు డీకే అరుణ విరుచుకుపడ్డారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావట్లేదని మండిపడ్డారు. మోదీ అనే పేరున్న వాళ్లంతా దొంగలేనని సంబోధిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లండన్ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్ పరువు తీశారంటూ.. దేశ ప్రతిష్టను మంట కలిపారని అనడం సరికాదని డీకే అరుణ అన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. దొంగల ఇంటి పేరు మోదీ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ఫలితంగానే రాహుల్ గాంధీకి రెండేళ్ల పాటు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పునిచ్చిందని డీకే అరుణ  గుర్తు చేశారు. దానికి బీజేపీకి సంబంధమేంటని ప్రశ్నించారు. కోర్టు తీర్పునకు, బీజేపీకి ముడి పెడుతూ కాంగ్రెస్ పార్టీ గొడవ చేయడం సరికాదని హితవు పలికారు. దేశంలోని అణగారిన వర్గాల ప్రజలపై ఉన్న కాంగ్రెస్ అహంకారానికి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిదర్శనమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news