తమిళనాడు డీఎంకేలో నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే అరుణ ఆత్మహత్యాయత్నం చేయగా ఆమె పరిస్థితి ఇప్పుడు విషమంగా మారింది. పార్టీ సమావేశాలకు తనని దూరం పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఉదయం తన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించిన అనంతరం అరుణను తిరునెల్వేలి లోని షిఫా ఆసుపత్రిలో చేర్పించారు. షిఫా హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అరాఫత్ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆమెను ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆమెను వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు.
ఎమ్మెల్యే పార్టీ లో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. బుధవారం సాయంత్రం జరిగిన బూత్ కమిటీ సమావేశంలో ఆమెను యూనియన్ కార్యదర్శి కుమార్ మద్దతుదారులు మాటలతో వేధించారని డీఎంకే వర్గాలు తెలిపాయి. కొంతమంది కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఎమ్మెల్యే మీటింగ్ హాల్ నుండి బయటకు వెళ్లిపోయారు. తరువాత ఆమెను తిరిగి హాల్‌లోకి పిలిచినప్పటికీ, కుమార్ మద్దతుదారులు ఆమె ప్రసంగానికి అంతరాయం కలిగించి మైక్‌ను ఆపివేశారని అందుకే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని అంటున్నారు.