గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో చెదురుముదురు వర్షాలు పడుతున్నాయి, తమిళనాడులో తుఫానులు వస్తుండడంతో దాని ప్రభావం కొంచెం మనపై పడింది, కానీ రానున్న వారం రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపటికి తీవ్రంగా మారనుండడంతో ప్రమాదం ముంచుకు వస్తోందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ వర్ష ప్రభావంతో ఆదివారం నుండి మంగళవారం వరకు ఆంధ్రప్రదేశ్ లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందు జాగ్రత్తగా కొన్ని కీలకమైం నిర్ణయాలు తీసుకుంది. ప్రజలు అత్యవసర సాయం మరియు ఏదైనా సమాచారం కోసం 1070 , 112 , 18004250101 హెల్ప్ లైన్ నెంబర్ లను అందుబాటులో ఉంచడం జరిగింది.
అంతే కాకుండా ఈ రోజులలో సముద్రంలోనూ చాలా అలజడి ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వెళ్ళకండి అని అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ప్రజలు అంతా చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.