BIG BREAKING:ఆస్ట్రేలియా చిత్తు… సీరీస్ ఇండియా కైవశం !

-

ఇండియా మరియు ఆస్ట్రేలియా లు వరల్డ్ కప్ తర్వాత జరుగుతున్న మొదటి సిరీస్ ను గెలుచుకోవాలన్న తాపత్రయంలో ఉన్నాయి. ఇందులో భాగంగా అయిదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇప్పటికే ముగిసిన మూడు మ్యాచ్ లలో ఇండియా 2 మరియు ఆస్ట్రేలియా ఒకటి గెలుచుకున్నాయి. ఈ రోజు రాయ్ పూర్ లో జరిగిన మ్యాచ్ లోనూ చాలా ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో హోం టీమ్ ఇండియా పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ ను 3-1 తేడాతో కైవశం చేసుకుంది. అయితే మొదటి రెండు మ్యాచ్ లలో చాలా జోరుగా కనిపించిన ఇండియా ఆ తర్వాత మ్యాచ్ లో పూర్తిగా తేలిపోయి ఓటమి పాలైంది. ఇక ఈ రోజు మ్యాచ్ లో రింకు సింగ్ మరియు జితేష్ శర్మ లు రాణించడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఛేదనలో నిర్ణీత ఓవర్ లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులకు పరిమితం అయ్యి 20 పరుగుల తేడాతో ఓటమి చెందింది.

ఈ మ్యాచ్ లో అక్సర్ పటేల్ కీలక సమయంలో 3 వికెట్లు తీసి ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ఇతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news