చాలా మంది పిల్లలు పాలు తాగే విషయంలో కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్లకు నచ్చితే తాగుతారు లేకపోతే లేదు. చాలా మంది పిల్లలతో తల్లి తండ్రులు ఎదుర్కొనే సమస్య ఇది. ఇక పిల్లల ఆరోగ్యం దృష్ట్యా వారికి పాలు పట్టించడం అనేది తప్పనిసరి అయిపోయింది. ఇక ఫ్యాట్ ఉన్న పాలు తాగడం వలన బరువు పెరుగుతారు అని భావిస్తూ ఉంటారు చాలా మంది. అయితే అది కరెక్ట్ కాదని అంటున్నారు వైద్యులు.
ఫ్యాట్ ఉన్న పాలు తాగితే బరువు తగ్గుతారని అంటున్నారు. ఆవు పాలు పిల్లలకు పట్టించడం తప్పనిసరి ఎందుకంటే కొవ్వు పదార్ధం ఆవు పాలల్లో ఎక్కువగా ఉంటుంది. పాలల్లో ఉండే కాల్షియం, అయోడిన్, విటమిన్లు ఎ మరియు బి 12, మరియు కొవ్వు పిల్లలకు మంచి బలమని అంటున్నారు. సగటున రెండు సంవత్సరాల వయస్సున్న పిల్లలకు కిలోగ్రాము బరువుకు 80 కేలరీలు అవసరమని చెప్తున్నారు.
12 నెలల వయస్సు నుండి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు పాలు అవసరం. ఒకటి నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు ఎక్కువగా పాలు తాగితే మాత్రం బరువు బాగా పెరుగుతారని అంటున్నారు. ఇక పిల్లల పాలకు సంబంధించి ఒక ప్రణాళిక అవసరమని చెప్తున్నారు వైద్యులు. ఏ విధంగా పడితే ఆ విధంగా పాలు తాగించావద్దని దానికి అంటూ ఒక సమయం కేటాయించుకుంటే మంచిది అంటున్నారు.