కాఫీ మనకు ఆరోగ్యకరమైన లాభాలను ఇస్తుంది. అయినప్పటికీ అతి స్వరత్ర వర్జయేత్.. అన్న చందంగా కాఫీ అయినా సరే దాన్ని ఎక్కువగా తాగకూడదు.
బయట చల్లని వాతావరణం.. శరీరం మాత్రం బద్దకంగా ఉంది.. ఏ పనీ చేయబుద్ది కావడం లేదు.. కాసింత రిలాక్స్ అయితే బాగుండును.. అనుకుని చాలా మంది నిత్యం కప్పుల కొద్దీ కాఫీ తాగేస్తుంటారు. అయితే కాఫీ మనకు ఆరోగ్యకరమైన లాభాలను ఇస్తుంది. అయినప్పటికీ అతి స్వరత్ర వర్జయేత్.. అన్న చందంగా కాఫీ అయినా సరే దాన్ని ఎక్కువగా తాగకూడదు. తాగితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
నిత్యం 3 కప్పులు లేదా అంతకన్నా ఎక్కువగా కాఫీ తాగే వారికి మైగ్రేన్ సమస్య వస్తుందట. అదేంటీ.. కాఫీ తాగితే తలనొప్పి ఎగిరిపోతుంది కదా.. అని ఎవరైనా సందేహించవచ్చు. అయితే అది నిజమే. ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగితే నిజంగానే తలనొప్పి తగ్గుతుంది. కానీ అంతకు మించితే తలనొప్పి తగ్గకపోగా మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని సైంటిస్టులు తాజాగా చేపట్టిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.
ఇక నిత్యం 3 కప్పుల కన్నా ఎక్కువగా కాఫీ తాగే వారికి మైగ్రేన్‌తోపాటు తరచూ ఆవలింతలు రావడం, తలనొప్పి ఎక్కువవడం, శబ్దం అంటే పడకపోవడం, ఆకలి కాకపోవడం, డిప్రెషన్ తదితర సమస్య వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యలు స్త్రీలలో మరింత ఎక్కువగా వస్తాయని సైంటిస్టులు తేల్చారు. కనుక ఎవరైనా సరే.. నిత్యం కాఫీని మోతాదుకు మించి తాగకూడదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కాఫీ ఎక్కువగా తాగేవారూ.. జాగ్రత్తగా ఉండండి.. మోతాదుకు మించి కాఫీని తాగకండి. అనవసరంగా అనారోగ్య సమస్యలను కొచి తెచ్చుకోకండి..!