బయటకు వెళ్లినప్పుడు పర్స్ తీసుకెళ్లడం అందరికీ అలవాటుగా ఉంటుంది. ఇక అమ్మాయిలతై హ్యాండ్ బ్యాగ్ మర్చిపోరు. అందులో సమస్తం ఉంటుంది. పనికొచ్చేవి, పనికిరానివి అంటూ తేడా లేకుండా..హ్యాండ్ బ్యాగ్ అంతా నింపేస్తారు. ఈ క్రమంలోనే మనం తెలిసీ తెలియక కొన్ని వస్తువులను పర్సుల్లో/ హ్యాండ్ బ్యాగ్స్ లో పెట్టుకుంటున్నాం. వీటివల్ల వాస్తుప్రకారం కొన్ని దోషాలను ఎదుర్కోక తప్పదంటున్నారు నిపుణులు. ఈరోజు మనం ఎలాంటివి పర్సులో ఉండాలి.. ఎలంటివి ఉండకూడదో చూద్దాం.
పర్సులో ఏం ఉంచుకోకూడదు..
సాధారణంగా ఏమైనా కొనుగోలు చేసిన తర్వాత బిల్లును పర్సులో పెట్టుకోవడం కొందరికి అలవాటు. కానీ ఆ బిల్లును ఎక్కువ కాలం పర్సులో పెట్టుకోకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి డబ్బుకు లోటు ఏర్పడుతుందట.. సిల్లీగా అనిపించినా ఇది నిజమండీ..!
వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో ఎప్పుడూ ఏ దేవత ఫోటోలను ఉంచుకోకూడదు. అలాగే చనిపోయిన కుటుంబ సభ్యుల ఫోటోలను కూడా తన పర్సులో పెట్టుకోకూడదు. కానీ చాలామంది ఈ రెండు పొరపాట్లూ చేస్తూనే ఉంటారు. ఇలా చేయడం వల్ల వ్యక్తి అప్పులు పెరుగుతాయని శాస్త్రం చెబుతోంది.
పర్సులో తాళం చెవిని ఉంచుకోవడం అందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇది మంచిది కాదట. కీని పర్సులో ఉంచుకోవడం వల్ల వ్యాపారంలో నష్టం ఏర్పడుతుంది. అలాగే చిరిగిన నోట్లను పర్స్‌లో ఉంచుకోవడం కూడా మానేయాలి.
మరీ పర్సులో ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలి..
వాస్తు శాస్త్రం ప్రకారం చిటికెడు బియ్యాన్ని పర్సులో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ డబ్బు స్తబ్దుగా ఉంటుంది. దీనితో పాటు లక్ష్మి దేవి ఆశీస్సులు ఉంటాయట.
డబ్బును సక్రమంగా ఉంచాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. కొంతమంది పర్సుల్లో చిందరవందరగా డబ్బును పెడుతుంటారు. ముందుగా పెద్ద నోట్లను, తర్వాత చిన్న నోట్లను, ఆపై ఇంకా చిన్న నోట్లను ఉంచండి. నాణేలు, నోట్లను ఎప్పుడూ కలిసి ఉంచకూడదు. నాణేల మోత వల్ల లక్ష్మి ఒక్క చోట ఉండదట.
ఈ విషయాలు కొందరు నమ్మరు.. చెత్తన్యూస్ అని కొట్టిపారేస్తుంటారు. కానీ తెలిసి ఎవ్వరూ అప్పులపాల్వాలని అనుకోరు కదా.. పైన చెప్పిన చిట్కాలు కూడా మీరు చేయలేనివి అయితే కాదు.. వాస్తుతో ఆటలెందుకు.. ఆధారాలు లేవని ప్రతీది కొట్టిపారేయడం కూడా కరెక్టు కాదు కదా బాస్..!