దుబాయ్ వెళ్తే ఈ షాపింగ్ మిస్ అవ్వద్దు..!

-

మీరు దుబాయ్ Dubai వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి ఫేమస్ అయినవి ఉన్నట్టే.. దుబాయ్ లో కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇవి కాస్త విభిన్నంగా ఉంటాయి పైగా ఎంతో ప్రత్యేకంగా కూడా ఉంటాయి. మరి ఆలస్యం ఎందుకు వీటి కోసం ఒక లుక్ వేసేయండి.

అరబిక్ లాంతర్లు:

దుబాయ్ కనుక వెళ్తే ఇక్కడ అద్భుతమైన లాంతర్లు ఉంటాయి. గాజుతో, అద్దాలతో వీటిని చేస్తారు వీటిని కనుక మీరు కొనుగోలు చేసి మీ ఇంట్లో పెట్టారంటే.. ఖచ్చితంగా మీ ఇంటికే అందం వస్తుంది.

కేమెల్ మిల్క్ చాక్లెట్స్:

దుబాయ్ లో కేమెల్ మిల్క్ చాక్లెట్స్ బాగా పాపులర్. దీనిలో 70 శాతం కోకో, ఖర్జూరం మరియు ఇతర పదార్థాలు ఉంటాయి. కేవలం రుచి మాత్రమే కాదు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే కూడా చాలా బాగుంటుంది. కనుక మీరు ఎప్పుడైనా దుబాయి వెళ్తే దీన్ని కూడా మిస్ అవ్వద్దు.

దుబాయ్ మసాలా దినుసులు:

దుబాయ్ మసాలా దినుసులు చాలా బాగుంటాయి. వంటకి ఎంతో అద్భుతమైన రుచి ఇవి తీసుకు వస్తాయి. మీరు ఎక్కువగా వంట చేస్తున్నా లేదు అంటే మంచి మసాలా రెసిపీస్ తయారు చేయాలన్న ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి.

లాంప్:

అరేబియన్ లాంప్స్ చూడటానికి చాలా బాగుంటాయి. మంచి మంచి రాళ్లతో ఇవి తయారు చేస్తారు. పైగా చూడగానే ఎంతగానో ఆకట్టుకుంటాయి. అదేవిధంగా అగరబత్తి పెట్టడానికి హోల్డర్స్ లాంటివి ఇక్కడ అవి చాలా బాగుంటాయి.

కాఫీ సెట్స్:

కాఫీ సెట్లు కూడా ఇక్కడ చాలా బాగుంటాయి. తక్కువ ధరకే అందమైన కాఫీ సెట్లని ఇక్కడ పొందొచ్చు. కనుక మీరు కనుక దుబాయ్ వెళితే అస్సలు వీటిని మిస్ అవ్వకుండా కొనుగోలు చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news