HCU భూములపై కేటీఆర్ రియాక్షన్ ఇదే..!

-

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు బీఆర్ఎస్ నేత కేటీఆర్ తో భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్ లో HCU భూముల ఇష్యూ పై విద్యార్థులతో కేటీఆర్ చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం 400 ఎకరాలు అమ్మి.. రూ.30వేల కోట్లు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నదని ఆరోపించారు. ఆదివారం ఉగాది, సోమవారం రంజాన్ పండుగ వేళ కోర్టుకు సెలవులు అని.. అందుకే అర్థరాత్రి మెషీన్లు, వందల సంఖ్యలో పోలీసులను పంపి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేస్తుందని మండిపడ్డారు.

విద్యార్తులను టెర్రరిస్టులను ట్రీట్ చేసినట్టు చేసుంటే.. రాహుల్ గాంధీకి కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. ప్యూచర్ సిటీలో 45వేల ఎకరాలుండగా.. ఈ 400 ఎకరాల మీద ఎందుకు అంత కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన తాజా ప్రకటన పై హెచ్సీయూ రిజిస్ట్రార్ ఆఫీస్ స్పందించింది. 2024 జులైలో అక్కడ ఎలాంటి సర్వే చేపట్టలేదని HCU  రిజిస్ట్రార్ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news