ఇక‌పై ద‌ళిత్ అనే ప‌దాన్ని ఉప‌యోగించ‌రాద‌ట‌..!

-

ప్రైవేటు టీవీ చాన‌ల్స్ ఇక నుంచి దళిత్ అనే ప‌దాన్ని ఉప‌యోగించ‌రాదు. ఈ మేరకు కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ద‌ళిత్ కు బ‌దులుగా ఎస్సీ (షెల్యూల్డ్ క్యాస్ట్‌) అనే ప‌దాన్ని ఉప‌యోగించాల‌ని సూచించింది. బాంబే హైకోర్టు ఆదేశాల మేర‌కు ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసిన‌ట్లు ఆ శాఖ వెల్ల‌డించింది. ఇక‌పై షెడ్యూల్డ్ కులాల వారిని దళితులు అని పిల‌వ‌వ‌ద్ద‌ని కోరింది. కాగా ఈ విష‌యంపై ఈ ఏడాది జూన్‌లోనే బాంబే హైకోర్టు స‌మాచార మంత్రిత్వ శాఖ‌ను వివ‌ర‌ణ అడ‌గ్గా, ప్ర‌స్తుతం ఆ శాఖ మీడియాకు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది.

దళితులు అనే పదాన్ని వ్యతిరేకిస్తూ పంకజ్ మేశ్రమ్ అనే వ్యక్తి బాంబే హైకోర్టులోని నాగపూర్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ పదం వాడవద్దని చెప్పింది. అలాగే ఆ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దళిత్ అనే పదానికి బదులు ఆంగ్లంలో షెడ్యూల్ క్యాస్ట్, స్థానిక భాషల్లో ఆ పదానికి అనువాదం ఉపయోగించాలని చెప్పింది.

కాగా దళిత్ అనే పదం వాడవద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడంపై కొన్ని సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పదం రాజకీయ ప్రాధాన్యతతో పాటు గుర్తింపుతో కూడుకున్నదని వారు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news