జ‌గ‌ప‌తి బాబు బాలీవుడ్ సినిమా కొత్త లుక్ చూశారా..!

-

ఒక‌ప్పుడు న‌టుడు జ‌గ‌ప‌తి బాబు చ‌క్క‌ని ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. కానీ.. మ‌ధ్య‌లో కొన్ని కార‌ణాల వ‌ల్ల కొంత కాలం పాటు సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మైనా.. మ‌ళ్లీ నెగెటివ్ షేడ్‌, విల‌న్ పాత్ర‌ల‌తో సినిమాల్లోకి వ‌చ్చి బిజీ అయ్యాడు. ఈ క్ర‌మంలో జ‌గ‌ప‌తి బాబు విల‌న్‌గా న‌టించిన దాదాపు అన్ని చిత్రాలు ఆయ‌న‌కు మంచి పేరే తెచ్చి పెట్టాయి. కాగా ఇప్పుడు తాజాగా జ‌గ‌ప‌తి బాబు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి 13 సినిమాలు చేస్తున్నాడు.

జ‌గ‌ప‌తి బాబు బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్‌ న‌టిస్తున్న‌ తానాజీ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడ‌ని కొన్నాళ్ళ క్రితం వార్త‌లు వ‌చ్చాయి. అయితే అవే వార్త‌లు ఇప్పుడు నిజమ‌య్యాయి. ఎందుకంటే స‌ద‌రు చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు ఫ‌స్ట్ లుక్‌ విడుద‌లైంది.  చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న తానాజీ చిత్రానికి ఓం రావత్‌ దర్శకుడు కాగా ఛత్రపతి శివాజీ కోసం పోరాడిన సుబేదార్‌ తానాజీ పాత్రలో అజయ్‌ దేవగన్‌ నటిస్తున్నాడు. జగపతి బాబుని ముఖ్య పాత్ర‌కి ఎంపిక చేశారు. రీసెంట్‌గా ఆయ‌న‌ పాత్రకు సంబంధించిన లుక్‌ టెస్ట్‌ను ఇటీవల నిర్వహించారు. ఈ లుక్ టెస్ట్‌కు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

కోర‌మీసంతో, అస‌లు సిస‌లైన యోధుడిగా జ‌గ‌ప‌తి బాబు క‌నిపిస్తుండ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది. కాగా ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూట్ సెప్టెంబ‌ర్ 25 నుండి ప్రారంభం కానుంది. 2019లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. అయితే జ‌గ‌ప‌తి బాబు తానాజీ సినిమాతో ఉత్త‌రాదిన కూడా మంచి ఆఫ‌ర్స్ రాబ‌ట్టుకునే అవ‌కాశం ఉంద‌ని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news