కరోనా ప్రజల్ని పట్టి పీడిస్తోంది. మహమ్మారి అయ్యి అందరిని ఈ వైరస్ భయ పెడుతోంది. దీర్ఘకాలిక వ్యాధుల తో బాధ పడేవారు ఈ కరోనా సమస్యలు ఎదుర్కొంటారని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. అంతే కాకుండా ఈ దేశంలో వివిధ నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ లో కరోనా ప్రభావం తక్కువేనని చెప్పారు. 45 మంది పోలీసులు కరోనా నుంచి కోలుకొని ఉన్న వారిని సిటీ వీధుల్లోకి ఆహ్వానించారు.
పశ్చిమ మండల పరిధి లోని పలు పోలీస్ స్టేషన్ కు సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి వీధుల్లోకి చేరారు. పోలీసులు ఇలాంటి సమయం లో కీలక పాత్ర పోషించారు. అంతే కాకుండా వాళ్ళు చేసిన సేవలు అమోఘం అనే చెప్పాలి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ శాఖ సేవలు చిరస్మరణీయమని అన్నారు అంజనీ కుమార్. పోలీసులు త్వరగా కోలుకొని వీధుల్లో చేరడం సమాజానికే ఆదర్శం అని చెప్పారు. అలానే కోలుకున్న వాళ్లందరినీ కూడా మిగిలిన వాళ్ళకి ధైర్యం ఇవ్వమని సూచించారు.