ఆండ్రాయిడ్ యూజర్ల డివైస్‌లకు మరింత రక్షణను అందించేందుకు గాను గూగుల్ ఎప్పటికప్పుడు అనుమానాస్పద యాప్‌లను తన ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే తాజాగా గూగుల్ మరో 11 యాప్స్‌ను తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. యూజర్ల ఆండ్రాయిడ్ డివైస్‌లకు హాని చేసే జోకర్ అనే మాల్‌వేర్‌ను సదరు యాప్స్ కలిగి ఉన్నాయన్న కారణంతో ఆ యాప్స్‌ను గూగుల్ తొలగించింది.
* com.imagecompress.android
* com.contact.withme.texts
* com.hmvoice.friendsms
* com.relax.relaxation.androidsms
* com.cheery.message.sendsms (two different instances) – రెండు యాప్‌లు
* com.peason.lovinglovemessage
* com.file.recovefiles
* com.LPlocker.lockapps
* com.remindme.alram
* com.training.memorygame
పైన తెలిపిన యాప్‌లను గనక ఏ ఆండ్రాయిడ్ యూజర్ అయినా వాడుతుంటే వెంటనే ఆ యాప్‌లను తమ ఫోన్ల నుంచి తొలగించాలని గూగుల్ తెలిపింది. ఈ యాప్‌లు ఆండ్రాయిడ్ డివైస్‌లలో యూజర్లకు చెందిన డేటాను వారికి తెలియకుండానే చోరీ చేస్తున్నాయని గూగుల్ వెల్లడించింది. కాగా ఇటీవలే గూగుల్ ఇలాంటి మరో 25 యాప్‌లను కూడా ప్లే స్టోర్ నుంచి తొలగించింది. వినియోగదారులకు సురక్షితమైన యాప్‌లను అందించేందుకే ఇలాంటి యాప్‌లను తొలగిస్తున్నట్లు గూగుల్ తెలిపింది.