రోజువారీ పనులు సమయానికి పూర్తవ్వాలంటే ఇలా చేయండి…!

-

సాధారణంగా మనం రోజుని మంచిగా స్టార్ట్ చేస్తే రోజులో చేయాల్సిన పనులు సమయానికి పూర్తవుతాయి. అదే రోజు బిగినింగ్ లో కాస్త అటూ ఇటుగా బద్దకంగా ఉంటే రోజంతా కూడా పనులు పూర్తి అవ్వవు. తద్వారా వాటిని వాయిదా వేయాల్సి ఉంటుంది. సక్రమంగా అనుకున్న పనులు అవ్వాలంటే రోజు ఇలా ప్రారంభించండి. ఇలా కనుక మీరు ప్రారంభిస్తే మీరు అనుకున్న పనులు చక్కగా పూర్తి చేయవచ్చు. అనుకున్నది సాధించడానికి ఇవి మంచి టిప్స్. వివరాల్లోకి వెళితే…

రాత్రి ప్లాన్ చేసుకోవడం:

రేపు ఏం చేయాలన్నది మీరు రాత్రి కూర్చుని ప్లాన్ చేసుకుంటే.. సులువుగా మీరు రోజుని ప్రారంభించడానికి వీలవుతుంది. ఏవైనా చిన్న చిన్న డెసిషన్స్ ఏమైనా ఉంటే రాత్రి మీరు ఫిక్స్ అయ్యి రేపు ఇది చేయాలి అని భావించండి.

రిఫ్రెష్ గా మొదలు పెట్టడం:

లేవగానే రిఫ్రెష్ గా పనులన్నీ ప్రారంభించండి. నిద్రపోయే ముందు ఆల్కహాల్, కెఫిన్, మొబైల్స్ వంటి వాటికి దూరంగా ఉండండి. రిలాక్స్ గా ఉండడం చేస్తే నిద్ర బాగా పడుతుంది. నిద్ర బాగా పట్టిన తర్వాత ఉదయం లేస్తే చాలా రిలాక్స్ గా ఉంటుంది. అదే ఒకవేళ మీరు కష్టపడి లేస్తే రిఫ్రెష్ గా రోజుని ప్రారంభించలేరు.

ఉదయాన్నే వీటిని చేయండి:

ఉదయాన్నే ఏ గందరగోళం లేకుండా హాయిగా నిద్ర లేవండి.
లేవగానే కొంచెం మంచి నీళ్లు తాగండి.
కాసేపు వ్యాయామం వంటివి చేసి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి.
పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఏవైనా కొత్త విషయాలు నేర్చుకోండి.
తర్వాత ప్రశాంతంగా మీ డే ని స్టార్ట్ చేయండి.

ఫోన్ ని తక్కువగా వాడండి:

సోషల్ మీడియాలో వచ్చే మెసేజెస్, మీమ్స్ వంటి వాటితో కాలక్షేపం చేస్తూ ఉంటే సమయం తెలియదు. సమయాన్ని వృధా చేసుకుంటే అనుకున్న పనులు పూర్తి చేయడం చాలా కష్టం కాబట్టి ఫోన్ ని తక్కువ వాడండి.

టాస్క్ పూర్తి చేయడం:

రాత్రి మీరు షెడ్యూల్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేయండి. ఒక పని నుంచి మరొక పని చేసేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి చెయ్యండి. లేదా కాసేపు వాక్ చేయండి. ఇలా చేస్తే మీ రోజులు మీరు సక్రమంగా వినియోగించుకుని అనుకున్న పనులు పూర్తి చేయడానికి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version