సమయానికి సరైన ఆహారం తీసుకోవడం అనేది మనిషికి శారీరకంగా, మానసికంగా మంచిది. నేటి సమాజంలో చాల మంది సమయానికి తినడం లేదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వారికీ తినడానికి కూడా సమయం దొరకడం లేదు. అయితే వీటి ప్రభావం ఆహారపు అలవాట్లపై పడుతుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు.. అంటే ఉదయాన్నే ఏవి పడితే అవి తినేస్తున్నాం. అయితే ఉదయానే నిద్ర లేచిన వెంటనే కచ్చితంగా ఏదైనా తినాల్సిందే అని మనం బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాం. అలా అని ఫాస్ట్ గా ఏదో ఒకటి తినేస్తే సరిపోతుందా అంటే ప్రమాదమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఖాళీ కడుపుతో మనం ఎలాంటి ఆహారం తింటున్నాం.. వాటితో ఎంత నష్టపోతున్నామో చూద్దామా.
మనలో చాలా మంది డైట్ లో భాగంగా పళ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే ఖాళీ కడుపుతో ఇవి తీసుకోవడం వల్ల క్లోమము మీద అధిక భారం పడుతుందట. అంతేకాక వీటిలోని ఫ్రక్టోస్ రూపంలో ఉన్న చెక్కర కాలేయంపై చెడు ప్రభావం చూపుతుందట. ఫలితంగా డయెబెటీస్ లాంటివి అటాక్ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామకాయ, నారింజ లాంటివి తినడం వల్ల అవి పేగులలో యాసిడ్ తయారుచేసే అవకాశాలు ఉన్నాయి. ఇవి ముందు ముందు అల్సర్, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు తెచ్చిపెడతాయట. దీంతో పాటు వీటిలో ఉండే ఫ్రక్టోస్ జీర్ణవ్యవస్థను పాడు చేస్తాయట.
చాల మందికి లేవగానే ఫ్రెష్ అయి కాఫీ తాగుతుంటాం. కానీ ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య వస్తుందట. కాఫీలోని హైడ్రోక్లోరిక్ యాసిడ్ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుందట.యోగర్ట్ లాంటి ఫర్మింటెడ్ పాలతో చేసిన పదార్థాలలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ లెవెల్ పెంచి ఎసిడిటీకి దారి తీస్తుందట. కాబట్టి ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు వీటికి దూరంగా ఉండటం తప్పనిసరి. వెజిటేబుల్ సలాడ్స్ మధ్యాహ్నం భోజనం చేయడానికి సరైనవి. ఉదయాన్నే ఇవి తినడం వల్ల వీటిలోని ఫైబర్ కారణంగా కడుపుపై అధిక భారం పడుతుంది. ఫలితంగా పొత్తికడుపులో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. టమాటలోని ట్యానిక్ యాసిడ్ కడుపులో చికాకును పెంచుతుంది.