కీబోర్డు వాడుతున్న సమయంలో మోచేతి నొప్పి వస్తుందా.. అయితే ఇలా చేయండి..!?

-

ఈ మధ్యకాలంలో కంప్యూటర్ వినియోగం మన జీవతంలో భాగమైపోయింది. ఉద్యోగులు, విద్యార్ధులు ప్రతి ఒక్కరు కీబోర్డు వాడుతునే ఉంటారు. టైపింగ్ సమయంలో మోచేతి నొప్పి వయస్సుతో సంబంధంలో లేకుండా అందరికి వస్తుంది. దింతో కొంత మంది పెయిన్ కిల్లర్స్ వాడి ఉపశమనం పొందుతారు. ఒకవేళ నొప్పి దీర్ఘకాలం కొనసాగితే వైద్యులను సంప్రదించటం మంచిదని సూచిస్తున్నారు. నొప్పి తీవ్రత పెరగక ముందే సత్వర ఉపశమం పొందాలంటే కొన్ని వ్యాయమాలు కూడా ఉన్నాయ్. అవేంటో చూద్దాం..

hand-pain

సాధారణంగా కండరాలు అలసిపోయినప్పుడు ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. కండరాలకు కాస్త ఉపశమనం ఇస్తే చాలు తిరిగి ఉత్తేజం పని చేస్తాయి. అదేలేగా చూడండి. మొదట గుప్పెట మూసి తెరవటమనే సులభమైన వ్యాయనం చేద్దాం. దీని వల్ల అలసిపోయిన కండరాలకి రిలాక్సేషన్ ఇస్తుంది. ఇలా చేయడం వలన లింబ్స్ లో రేంజ్ ఆఫ్ మోషన్ పెరుగుతుంది. దీని కోసం స్ట్రెస్ బాల్స్ కూడా ఉపయోగించవచ్చు. మీ చేతి వేళ్ళన్నీ దగ్గరకి తెచ్చి తెరవాలి.ఇలా రోజు యాబై నుంచి వందసార్లు చేయాలి.

వర్క్ చేసుకుంటున్నప్పుడు కుర్చీలో కూర్చుంటాం కదా.. అదే సమయంలో మీ అరచేతులని టేబుల్ లేదా డెస్క్ కిందుగా ఉంచి టేబుల్‏కి మీ అరచేతులని ప్రెస్ చేయండి. ఐదు నుండి పది సెకన్ల పాటు చేస్తే క్రమంగా నొప్పి తగ్గుతుంది. గుప్పెట మూసి బొటన వేలు పైకెత్తండి, థంప్స్ అప్ సిగ్నల్ లాగా బొటన వేలు కదలకుండా రెసిస్టెన్స్ ఇవ్వండి. ఇప్పుడు రెండవ చేతితో నెమ్మదిగా బొటన వేలిని వెనక్కి లాగండి. హోల్డ్ చేసి రిపీట్ చేయండి.

మీ రెండు చేతులూ నమస్కారం చేస్తునట్లుగా ఉంచండి. మీ మోచేతులు కూడా ఒకదాన్నొకటి తాకుతూ ఉండేలా ఉంచండి. ఇప్పుడు మీ అర చేతులు దగ్గరా ఉంచి మీ మోచేతులని దూరం జరపండి. ఇలా చేస్తున్నప్పుడు మీ చేతులని కిందకి దించండి. మీ బెల్లీ బటన్ వరకూ మీ చేతులు వచ్చాక ఆపేయండి. ఇలా పది నుండి ముప్ఫై సెకన్ల పాటు ఉండండి. రిపీట్ చేయండి.

ఒక చేతిని మీ భుజాల ఎత్తులో చాచండి. అర చేయి నేలని చూస్తూ ఉండాలి. ఇప్పుడు ముంజేతిని రిలీజ్ చేయండి, అంటే మీ వేళ్ళు నేల వైపు ఉంటాయి. రెండవ చేతితో ఈ చేతి వేళ్ళని పట్టుకుని మృదువుగా మీ బాడీ వైపు లాగండి. ఇలా పది నుండి ముప్ఫై సెకన్లు ఉంచండి. మీరు వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక నిమిషం కేటాయించిన మీ చేతికి ఉపశమం లభించినట్టే..

Read more RELATED
Recommended to you

Latest news