మ్యూచువల్ ఫండ్లలో ఎన్ని రకాల ఫండ్లు ఉంటాయి, వేటిలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం ఉంటుంది, ఏ ఫండ్లలో ఎందుకు పెట్టుబడి ఎక్కువ సేఫ్ గా ఉంటుంది అనే విషయాలు చాలామందికి తెలియవు. మీ అవసరాన్ని బట్టి పెట్టుబడి పెట్టడం తెలుసుకోండి.
ముందుగా మ్యూచువల్ ఫండ్లలో రకాలు తెలుసుకోవాలి. ఈక్విటీ గురించి చాలామందికి తెలుసు. కానీ హైబ్రిడ్ ఫండ్స్ గురించి తక్కువ మందికి తెలుసు. ఈక్విటీ ప్లస్ డెబ్ కలిసి ఉండే ఫండ్లని హైబ్రిడ్ ఫండ్లు అంటారు. కనీసం అరవై శాతం ఈక్విటీ ఉండి మిగతా నలభై శాతం డెట్ కలిసి ఉంటే హైబ్రిడ్ అవుతుంది.
దీనివల్ల ఈక్విటీలోని రిస్క్ తీసుకునే తత్వం, డెట్ లోని రక్షణ తత్వం కలిసి బ్యాలెన్స్ గా మారుతుంది. అందుకే వీటిని బ్యాలెన్స్ ఫండ్స్ అని కూడా పిలుస్తారు.
రిస్క్ తీసుకోవడానికి భయపడుతూ, ఎక్కువ రిటర్న్స్ కావాలనుకునే వారు ఇందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి నెల నెల SWP ద్వారా ఎంతో కొంత అమౌంట్ బ్యాంకు ఖాతాకి రప్పించుకునే అవకాశం ఉంది.
రిటైర్ మెంట్ తర్వాత వచ్చే అమౌంట్ ఇందులో పెట్టుకుని SWP సౌకర్యం పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వృద్ధాప్యంలో ఈక్విటీ మీద పెట్టి రిస్క్ తీసుకోవడం అనవసరం అనుకున్న వాళ్ళకి, హైబ్రిడ్ ఫండ్స్ మంచి ఆప్షన్.
ఇదండీ హైబ్రిడ్ ఫండ్స్ సంగతి. ఏ ఫండ్ లో పెట్టుబడి పెట్టినా, దీనికోసం పెడుతున్నారో ముందే డిసైడ్ అవ్వండి.
గమనిక: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడులకి లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు స్కీముకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా చదవండి.