ఇన్యూరెన్స్ గురించి తెలిసిన వాళ్ళు టర్మ్ ఇన్యూరెన్స్ గురించి తెలుసుకోవాల్సిందే..

-

లైఫ్ ఇన్స్యూరెన్స్.. చాలా మంది దీన్ని పట్టించుకోవడంలో ఆలస్యం చేస్తుంటారు గానీ ఇది ఆలస్యం చేయాల్సిన విషయమే కాదు. లైఫ్ ఇన్స్యూరెన్స్ గురించి పట్టించుకునే వాళ్ళందరూ టర్మ్ ఇన్స్యూరెన్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి మన ఆశలు, ఆశయాలు మనం ఉన్నా లేకున్నా జరిగేలా చూడడానికి టర్మ్ ఇన్స్యూరెన్స్ బాగా పనిచేస్తుంది. మన మీద డిపెండ్ అవుతున్న కుటుంబ సభ్యులకి మనం లేకపోయినా అదే విధమైన జీవితాన్ని అందించడానికి టర్మ్ ఇన్స్యూరెన్స్ ఉపయోగపడుతుంది.

ఐతే టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎంత తక్కువ వయసులో టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే అంత మంచిది. 18సంవత్సరాలు పైబడిన ప్రతీ ఒక్కరూ టర్మ్ ఇన్స్యూరెన్స్ కి అర్హులు. వయసు ఎక్కువ ఆవుతుంటే టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం ఎక్కువవుతుంది. అందుకే తక్కువ వయస్సు ఉన్నప్పుడే ఈ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం ఉత్తమం. అలా అని వయసు ఎక్కువవుతున్న వారు తీసుకోకూడదని కాదు.

ఎవ్వరికైనా టర్మ్ ఇన్స్యూరెన్స్ ఉండడం మంచిదే. అప్పుడే జాబ్ చేస్తున్నవారు ఎంత తొందరగా టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే అంత మంచిది. ఐతే టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకున్నవారు కొన్ని విషయాలని గుర్తుంచుకోవాలి. ఈ ఇన్స్యూరెన్స్ కడుతూ పోతుంటే చివర్లో మెట్యూరిటీ అమౌంట్ అంటూ ఏమీ ఉండదు. కాకపోతే కొన్ని కంపెనీలు మనం కట్టిన డబ్బులని తిరిగి ఇచ్చే వెసులుబాటుని కల్పిస్తున్నాయి. మీరు చేస్తున్న జాబ్, మీ సాలరీ, ఇన్ కమ్ టాక్స్ ఫైలింగ్ మొదలగు విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మీకెంత వరకు ఇన్స్యూరెన్స్ ఇవ్వగలరో లెక్కకట్టి ఇస్తారు. దాన్ని బట్టి యాభై లక్షలా, కోటి రూపాయలా అనేది టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకునే వారిపై ఆధారపడి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news