వైట్‌, గ్రీన్‌, మ్యాడ్‌ తేనె రకాల గురించి తెలుసా..? ఇవి తింటే మత్తు ఎక్కుతుందట..

-

తేనె ఆరోగ్యానికి ఎంత మంచిదో మనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కానీ ప్యూర్‌ తేనె దొరకడమే కష్టం.. స్వచ్ఛమైన తేనె తింటే.. దాని వల్ల కలిగే లాభాలను అన్నీ పొందవచ్చు. తేనె అంటే ముదురు బంగారు రంగులో ఉంటుంది.. ఇలా ఉంటేనే అది ఒరిజినల్‌ అని మనం అనుకుంటాం.. కానీ మీకు రంగురంగుల తేనె గురించి తెలుసా..? ఊదా, ఆకుపచ్చ, తెలుపు, నలుపు వంటి రంగుల్లో ఉండే తేనె రకాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఈ తేనెలు లభిస్తున్నాయి.

ఊదా, ఆకుపచ్చ రంగు తేనె..

ఊదా రంగులో ఉన్న తేనె ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తేనెపై కాంతి పడినప్పుడు అది ఊదా రంగులోకి మారుతున్నట్టు గుర్తించారు. ఈ తేనెను ‘బ్లూ హనీ’ అని కూడా అంటారు. ఈ తేనెను అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో దొరుకుతుంది. అక్కడ అనేక ప్రాంతాలలో ఉండే తేనెటీగలు దీన్ని ఉత్పత్తి చేస్తాయి. అలాగే ఇక్కడి తేనెటీగలు ఆకుపచ్చ తేనెను కూడా ఉత్పత్తి చేస్తాయి.

మ్యాడ్ హనీ..

దీని పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది..ఈ తేనె తింటే.. మత్తుగా ఒక పెగ్‌ వేసిన అనుభూతి కలుగుతుందట.. అందుకే దీనికి మ్యాడ్‌ హనీపేరు పెట్టారు.
ఇందులో గ్రేయనోటాక్సిన్ అనే పదార్థం ఉంటుంది. దీనివల్ల మత్తు, మైకం, భ్రాంతులు కలుగుతాయి. జంతువులు, మనుషులు ఎవరూ తాగినా కూడా మత్తు కలుగుతుంది.

వైట్ హనీ

కివే తేనెను వైట్ హనీ అని కూడా పిలుస్తారు. ఇది హవాయిలో లభిస్తుంది. ఇది కివే చెట్టు పువ్వుల నుండి సేకరించిన పుప్పొడితో ఈ తేనె తయారవుతుంది. అందుకే ఈ తేనె తెల్లగా ఉంటుంది.

మనుక తేనె

మనుకా తేనె న్యూజిలాండ్ తీర ప్రాంతంలో లభిస్తుంది. మనుక మొక్కలకు పూచే పూలలోని పుప్పొడితో మాత్రమే తేనెటీగలు ఈ తేనెను తయారుచేస్తాయి. ఈ తేనెలో యాంటీ బ్యాక్టిరియల్, హీలింగ్ గుణాలు ఎక్కువ. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి.

క్రీమ్డ్ క్లోవర్ హనీ

ఈ తేనె చాలా మందంగా ఉంటుంది. ఇది క్రీమ్‌లా అనిపిస్తుంది. క్లోవర్ అని పిలిచే పువ్వులపై ఉండే పుప్పొడితో తేనెటీగలు ఈ తేనెను తయారుచేస్తాయి. దాదాపు 300 రకాల క్లోవర్ మొక్కలు ఉన్నాయి.

యూకలిప్టస్ తేనె

యూకలిప్టస్ తేనె …మెంథాల్ లాంటి రుచిని కలిగి ఉంటాయి. ఇది అత్యంత శక్తివంతమైన తేనె రకాల్లో ఒకటిగా నమ్ముతారు. యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఈ తేనె రకం జలుబు, దగ్గు, పుండ్లు, వాపులను నిరోధిస్తుంది.

బుక్వీట్ తేనె

బుక్వీట్ మొక్కకు పూసే తెల్లటి పువ్వుల నుంచి సేకరించిన తేనె రకం ఇది. ఈ తేనెను బార్బెక్యూ సాస్, డెజర్ట్‌లు, టీలు తయారు చేయడంలో ఉపయోగిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version