బుల్లితెరపై అదరగొడుతున్న అన్నపూర్ణమ్మ.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’, ‘జబర్దస్త్’లో ఆమె రెమ్యునరేషన్ ఎంతంటే?

-

వెండితెరపైన చక్కటి పాత్రలు పోషించిన సీనియర్ నటి అన్నపూర్ణమ్మ. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు స్టార్ హీరోలకు తల్లిగా నటించిన అన్నపూర్ణమ్మ ప్రజెంట్ బుల్లితెరపై సందడి చేస్తోంది. ఈటీవీ వారి ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’, ‘జబర్దస్త్’ కార్యక్రమాల్లో అన్నపూర్ణమ్మ కనబడుతోంది. అన్నపూర్ణమ్మ వయసు మీద కమెడియన్స్ పంచులు వేసేందుకు ప్రయత్నిస్తుండగా, రివర్స్ లో అదిరిపోయే పంచులు వేస్తోంది అన్నపూర్ణమ్మ.

‘జబర్దస్త్’ కార్యక్రమంలో ఆటో రామ్ ప్రసాద్ టీమ్ లో మెయిన్ గా కనబడుతోంది అన్నపూర్ణమ్మ. తన దైన శైలి మాటలు, పంచులతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల కాలంలో ఆమె వెండితెరపైన పెద్దగా కనబడలేదు. ఈ క్రమంలోనే బుల్లితెరపైన ఆటో రామ్ ప్రసాద్ ‘జబర్దస్త్’ టీమ్ లో రెగ్యులర్ గా కనబడుతోంది.

తన దైన శైలి పంచులు, కామెడీ టైమింగ్ తో జనాలను ఎంటర్ టైన్ చేస్తోంది. సందర్భానుసారంగా పంచులు వేస్తూ నవ్వులు పూయిస్తోంది అన్నపూర్ణమ్మ. ‘శ్రీ దేవి డ్రామా కంపెనీ’లోనూ అన్నపూర్ణమ్మ కనబడుతోంది. ఈ రెండు కార్యక్రమాల్లో కి వస్తున్నందుకు అన్నపూర్ణమ్మకు రెమ్యునరేషన్ బాగానే ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్ ప్రకారం అన్నపూర్ణమ్మకు ఈ రెండు కార్యక్రమాలకు కాల్ షీట్ కు రూ.3 లక్షల వరకు ఇస్తున్నట్లు సమాచారం. ఇది చాలా ఎక్కువ అని అనుకుంటున్నప్పటికీ ఆమె రేంజ్ కు తగ్గట్లేనని నిర్వాహకులు భావిస్తున్నారట.

 

Read more RELATED
Recommended to you

Latest news