Big Boss OTT Telugu : స్వతంత్రతను ఇచ్చిన ‘తొలిప్రేమ’..‘బిగ్ బాస్’లో సత్తా చాటుతున్న బిందు మాధవి!

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీ వర్షన్ రోజురోజుకూ ఇంట్రెస్టింగ్ గా మారుతున్నదని బీబీ వ్యుయర్స్ అంటున్నారు. ‘బిగ్ బాస్’ తాజాగా కంటెస్టెంట్స్ కు తమ తలుపు తట్టిన ‘తొలిప్రేమ’ గురించి వివరించాలనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ తమ ఫస్ట్ లవ్ స్టోరిస్ షేర్ చేసుకున్నారు.

ఈ క్రమంలోనే బీబీ లవర్స్ ఫేవరెట్ కంటెస్టెంట్ గా భావించబడుతున్న బిందు మాధవి కూడా తన ఫస్ట్ ‘లవ్ స్టోరి’ షేర్ చేసుకుంది. అయితే, తాను చెప్పిన విధానం ద్వారా బిందు మాధవి మరింత మందిని తన సపోర్టర్స్ గా మార్చుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాను తన ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ హాలిడేస్ లో తొలిప్రేమలో పడ్డానని పేర్కొంది బిందు మాధవి. తన లవ్ స్టోరి బ్రేకప్ గురించి ‘బిగ్ బాస్’ పార్టిసిపేటర్ గా వచ్చిన తొలినాళ్లలోనే చెప్పింది బిందు.

వెల్లూరు ఇంజినీరింగ్ కాలేజ్‌లో తాను బీటెక్ చదువుకున్నానని, ఫస్ట్ ఇయర్ పూర్తయ్యాక విజయవాడకు వచ్చానని చెప్పింది. అప్పుడు తన తండ్రి ఉద్యోగరిత్యా విజయవాడకు ట్రాన్స్ ఫర్ అయిన నేపథ్యంలో అక్కడకు వచ్చానని అంది. ‘నాన్న విజయవాడలో పని చేస్తున్నపుడు బ్యాడ్మింటన్ ఆడేందుకు స్కూటి మీద విజయవాడలో ప్లే గ్రౌండ్ కు వెళ్లాను. అక్కడ నాకు ఒక వ్యక్తి కలిశాడు’ అని తెలిపింది బిందు మాధవి. అతని పేరు R..తో స్టార్ట్ అవుతుందని అంది.

దాంతో కంటెస్టెంట్స్ రాంబాబు, రామ్ రెడ్డి, రాజేశ్ అంటూ కొన్ని పేర్లు గెస్ చేశారు. అలా తన ఫస్ట్ లవ్ .. చాల కొత్తగా ఉందని, ప్రతీ రోజు తన కోసం అతను స్కూటి మీద చిన్న చిన్న గిఫ్ట్ లు పెట్టేవాడని చెప్పింది. ఈ క్రమంలోనే ఫైనల్ గా తనని కలిశానని చెప్పింది.

అతను కోయంబత్తూరులో ఉంటే, తాను వెల్లూరులో ఉండేదానని, అలా తను, నేను కలిసి చెన్నైలో హ్యాపీగా తిరిగామని, తమది ఒక సినిమాటిక్ లవ్ స్టోరి అని వివరించింది బిందు మాధవి. అయితే, చివరకు అతనితో బ్రేకప్ అయిందని, కానీ, అతనిచ్చిన ధైర్యం, సపోర్ట్ తోనే తాను స్వతంత్రంగా ఉన్నానని, అలా ‘బిగ్ బాస్’ వచ్చేందుకు అతను కారణమని తెలిపింది బిందుమాధవి. బిందు మాటలు కంటెస్టెంట్స్ సైలెంట్ గా విన్నారు. ఇక ఆమె సపోర్టర్స్ అయితే ‘బిందు క్వీన్ ఆఫ్ బీబీ, గ్రేట్ బిందు, వెరీ గుడ్, ఇండిపెండెంట్ ఉమన్’ అని చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news