మనిషి దైనందిన జీవితంలో యోగా చాలా అవసరం..ఇప్పుడున్న పరిస్థితులు నుంచి బయటకు రావాలంటే మాత్ర శరీరానికి కాస్త రిలాక్స్ అవసరం.అందులో యోగా బెస్ట్ చాయిస్..ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రోజులో కొంత సమయమైనా వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న జనం వీటిపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. అందుకనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగా వైపు ప్రజలు దృష్టి సారించేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇకపోతే ఆరొగ్యాన్ని ఇచ్చే సులువైన యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వివిధ రకాల ఆసనాలు వేయటం ద్వారా ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది. ఒక్కో ఆసనం ద్వారా ఒక్కో రకమైన అనారోగ్య సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
వృక్షాసనం: రోజూ ఈ ఆసనం చేస్తే కాళ్ల కీళ్లు, మోకాళ్లు చీలమండల సడలించబడతాయి. కాళ్ల కండరాలకు సుభావన కలుగ జేస్తుంది. కీళ్ల (రుమాటిక్) నొప్పులు తగ్గుతాయి.
వజ్రాసనం: ఈ ఆసనం ద్వారా తొడ, పిక్క కండరాలకు సుభావన కలుగుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. వెన్నెముకకు ఆధారమై నిటారుగా ఉంటుంది. ఈ ఆసనం చేస్తే ఆయాసం తగ్గుతుంది.
భుజంగాసనం: అధిక శ్రమ మల్ల కలిగే నడుం నొప్పులు తొలగిపోతాయి. స్థాన చలనం కల వెన్నెముక పూసలు యథాస్థానానికి వస్తాయి. మెడ నొప్పులు, ఉబ్బసం రోగులకు ఈ ఆసనం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. భోజనాలు చేసిన తరువాత వాయువులు (గ్యాస్ ట్రబుల్) వెళ్లే వారికి ఇది మంచి ఆసనం, వాత రోగాలు తగ్గుతాయి.
పవన ముక్తాసనం: పవన అంటే గాలి, ముక్త అంటే విడిచి పెట్టడం. కడుపులోని చెడుగాలిని బయటకు పంపడం ఈ ఆసనంలో ప్రత్యేకత. మలబద్ధకం, తరచు వచ్చే త్రేన్పులు తగ్గి జీర్ణ శక్తి వృద్ధి చెందుతుంది. వెన్నెముక వెనుక కండరాలు, నరాలు ఉత్తేజమవుతాయి.
తాడాసనం: ఈ ఆసనం ఎత్తు పెరగడానికి సహకరిస్తుంది. పొత్తి కడుపు, వెన్నెముక నిటారుగా సాగడం ద్వారా జీర్ణ కోశం శుభ్రమవుతుంది. పేగుల్లో, పొట్టలో కొవ్వులను కరిగింది ఆరోగ్య వంతంగా చేస్తుంది…
వీటితో పాటు ఇంకా ఎన్నో ఆసనాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిని వేయడం వల్ల శరీరానికి మంచి ఆరోగ్యం అని యోగా నిపుణులు అంటున్నారు..మీరు కూడా ఏదొక ఆసనం లేదా ధ్యానం చేస్తూ మీ ఆరొగ్యాన్ని కాపాడుకోండి..