పోన్నియన్ సెల్వన్ మొదటిరోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లు తెలుసా..?

-

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ మణిరత్నం. ఈ డైరెక్టర్ నుంచి ఏదైనా సినిమా విడుదలవుతుందంటే చాలు సినీ ప్రేక్షకులు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా తాజాగా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా మొదటి భాగం నిన్నటి రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. అయితే మొదటి రోజు కొన్ని చోట్ల మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇందులో ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తీ, జయం రవి, విక్రమ్ తదితర నటీనటుల సైతం నటించారు. అయితే ఈ సినిమా మొదటి రోజు భారీ స్థాయిలో వసూలను రాబడుతుందని ప్రతి ఒక్కరు ఊహించారు.

ఈ చిత్రం అనుకున్నంత పనే చేసింది విక్రమ్, వాలిమై చిత్రాలను వెనక్కి నెట్టివేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఒక్కరోజే దాదాపుగా రూ.39 కోట్ల రూపాయలు కాబట్టి తమిళనాడులోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాగా నిలిచిందని సమాచారం. తమిళనాడులో ఈ సినిమా ఒక్కరోజు ఏకంగా రూ.23.50 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లుగా తెలుస్తున్నది. అలాగే తెలుగు రాష్ట్రాలలో రూ.5.50 కోట్ల రూపాయలు రాబట్టగా, కర్ణాటకలో రూ.4 కోత రూపాయలు ,కేరళలో రూ.3.25 కోట్ల రూపాయలు రాబట్టగా, నార్త్ ఇండియాలో కేవలం రూ.2.75 కోట్ల రూపాయలను రాబట్టింది దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే రూ.39 కోట్ల రూపాయలను రాబట్టినట్లుగా తెలుస్తున్నది.

అయితే ఈ సినిమాని కావాలని కొంతమంది నెగిటివ్ టాప్ ని స్ప్రెడ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వీకెండ్ రోజుల్లో ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు చేయబడుతుందో అని అభిమానుల సైతం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. దాదాపుగా ఈ చిత్రం 500 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించడం జరిగింది. మరి ఈ సినిమా చివరికి ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news